ఆ డైరెక్టర్ తన కెరీర్ ని నాశనం చేసాడని వాపోయిన పాయల్

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ హాట్ ఫిగర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పాయల్ రాజ్పుత్. కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ఎక్స్100’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళు పోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు ‘ఆర్డీఎక్స్100’ లాంటి చిన్న చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. ‘ఆర్డీఎక్స్100’ సినిమాలో ‘ఆర్ఎక్స్100’ ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం అందుకోలేదు. అలాంటి టైంలో అనుకోకుండా వెంకటేష్ నటించే ‘వెంకీమామ’ సినిమా అమ్మడి తలుపు తట్టింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా అయినా టాలీవుడ్ లో పాగా వేద్దామనుకున్న ఈ భామను మళ్ళీ నిరాశే ఎక్కిరించింది. ఈ చిత్రంలో తన నటనకు మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.

అయితే ఈ మధ్య పాయల్ గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. దర్శకుడు బాబీ ‘వెంకీమామ’ సినిమాలో తన పాత్రను ఆంటీలా చూపించి తన కెరీర్ ను నాశనం చేసాడని తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకొని వాపోయిందనేది దీని సారాంశం. ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంటు కు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసిందే ఒక్కసారి ఏ నటికైనా ఐరన్ లెగ్గా ముద్ర పడితే ఆమెను పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు పాయల్ రాజ్పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. దీనితో హాట్ బ్యూటీ షాపు ఓపెనింగ్స్ వెనుక తిరుగుటు తనను తాను బిజీగా మార్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పాయల్ ఫొటో షూట్లతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ ఎప్పటికప్పుడు ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతూ ఉంటుంది. తమ అభిమాన నటి తిరిగి మంచి ఆఫర్స్ సొంతం చేసుకొని ఇండస్ట్రీ లో స్థిర పడాలని పాయల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-