వయసుని ముప్పైల్లో ఆపేసింది!

0

బాలీవుడ్ లో చాలామంది బ్యూటీలే ఉన్నారు.. ఇరవైల్లో ముప్పైల్లో ఉండే బ్యూటీలు తమ అందచందాలతో.. తీరైన ఒంపులతో నెటిజన్లను కవ్వించడం చాలా సాధారణ విషయం. అయితే వీరికి పోటీనిస్తూ యాభైలకు దగ్గరపడుతున్న భామలు ఫిట్ నెస్ మెయింటెయిన్ చెయ్యడం.. బికిని బ్యూటీలుగా చెలామణీ కావడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే అంశమే. అలాంటి లేటు వయసు హాటు భామల్లో మందిరా బేడి ఒకరు.

అప్పుడెప్పుడో సమాజాన్ని ఉద్దరించే టీవీ ఛానెల్స్ లేని సమయంలో దూరదర్శన్ లో ప్రసారమైన తొలి హిందీ డైలీ సీరియల్ ‘శాంతి’ లో టైటిల్ పాత్ర పోషించిన ఘనత ఈ మందిర సొంతం. షారూఖ్ ఖాన్ – కాజోల్ క్లాసిక్ హిట్ ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ భామ క్రికెట్ టోర్నమెంట్ హోస్టుగా అందాలు ఒలికిస్తూ కూడా సంచలనం సృష్టించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భం గా తీసిన ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. సన్ బాత్ చేస్తూ ఒక బెడ్ పై బోర్లా పడుకొని సూపర్ పోజిచ్చింది. పింక్ బికినీలో మందిర ఇచ్చిన పోజును చూస్తే ఎవరూ ఈమెకు నలభై ఏడు వయసని అనుకోరు. అంత ఫిట్టుగా.. స్లిమ్ముగా మెయిన్టెయిన్ చేస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “షూటౌట్ ఎట్ మాల్దీవ్స్”.. “సెక్సీ ఏంజెల్ బ్యాక్ ఎండ్”.. “మీకు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ మేడమ్” అంటూ పొగిడి చంపేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ‘సాహో’ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంలో ‘అడంగాదే’ లోనూ నటిస్తోంది
Please Read Disclaimer