ఇటు చిరు అటు ప్రభాస్ మధ్యలో బాలయ్య!

0

రిలీజ్ కి మరో పదిహేను రోజులు ఉండటంతో ‘సాహో’ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టర్స్ వదులుతూ ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఓ వైపు ప్రభాస్ కూడా బాలీవుడ్ కోలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యాడు. మరో వైపు ‘సైరా’ ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఈరోజు ఉదయం నుండే ‘సైరా’ టీజర్ కోలాహలం మొదలయ్యింది. సరిగ్గా ఉదయం మధ్యాహ్నం 2 తర్వాత టీజర్ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించడంతో మెగా అభిమానుల్లో ఎప్పుడెప్పుడు టీజర్ చూద్దామా అనే ఉత్సాహంతో ఆతృత మొదలైంది.

అయితే సరిగ్గా అటు సాహో – ఇటు సైరా హడావుడి నడుస్తుండగా ఎవరూ ఊహించని విధంగా తన 105 సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ స్టైల్ వదిలాడు బాలయ్య. సరిగ్గా ‘సైరా’ టీజర్ సందడి మొదలవుతున్న సమయంలో వ్యాన్ డైక్ బియర్డ్ స్టైల్ లో కనిపిస్తూ నందమూరి ఫ్యాన్స్ ని సప్రయిజ్ చేసాడు. తన సరికొత్త లుక్ తో ఒక్కసారిగా ట్రెండింగ్ లో నిలిచాడు బాలయ్య. నిన్నే బాలయ్య న్యూ లుక్ తో ఓ పిక్ బయటికొచ్చింది. అది బాగా వైరల్ అయింది కూడా. అందరూ ఇందులో ఉంది బాలయ్యేనా..? అనేలా కనిపించాడు నందమూరి హీరో. ఇక ఎలాగో లుక్ బయటికొచ్చింది కాబట్టి ఈ రోజు ఓ మంచి ముహూర్తం చూసి బాలయ్య తన లుక్ తో పలకరించాడు.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 105 సినిమా థాయిలాండ్ లో షూట్ జరుగుతుంది. కే . ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీ. కళ్యాణ్ నిర్మాత. సినిమాకు రూలర్ – క్రాంతి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్ తో ఫస్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer