సాహో ఆడియో తేదీ-వెన్యూ ఫిక్స్

0

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్- 2019 మూవీ `సాహో` ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్- శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే పోస్టర్లు.. టీజర్లు.. మేకింగ్ వీడియోలు.. సినిమాపై హైప్ ని పెంచాయి. ఈ సినిమా రాక కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. మునుముందు ట్రైలర్.. ఆడియో ట్రీట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. సాహో ఆడియోకి సంబంధించిన వివరం తెలిసింది. ఆడియో రిలీజ్ కి తేదీల్ని.. వెన్యూల్ని యువి క్రియేషన్స్ సంస్థ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. సాహో రేంజుకు తగ్గట్టే ఆడియో రిలీజ్ కి భారీ ప్లానింగ్ రెడీ అయ్యింది. ఆగస్ట్ 17న హైదరాబాద్- యల్.బి స్టేడియంలో భారీగా ప్రభాస్ అభిమానుల మధ్య ఈవెంట్ జరగనుంది. అలాగే ఆగస్టు 21 న కేరళ- కొచ్చిలో.. ఆగస్టు 25 న కర్నాటక- బెంగళూరులో భారీ ఈవెంట్లు చేయనున్నారు. చివరిగా ఆగస్టు 27న ముంబై లో మరో ఈవెంట్ ని యు.వి.సంస్థ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.

`సాహో` సినిమాపై ఇటు తెలుగు రాష్ట్రాలు సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలేర్పడ్డాయి. బాలీవుడ్ లోనూ సాహోకి అసాధారణ క్రేజు నెలకొంది. అందుకు తగ్గట్టే అన్ని మెట్రో నగరాల్లోనూ ఇలా భారీ ఈవెంట్లను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అలాగే అమెరికా సహా పలుచోట్ల ప్రమోషనల్ కార్యక్రమాలు ఉంటాయన్న సమాచారం అందుతోంది.
Please Read Disclaimer