‘సాహో’ ఫ్యాన్స్ కి జాక్విలిన్ ట్రీట్

0

దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ ఆద్యంతం భారీ యాక్షన్ దృశ్యాలు కళ్లు చెదిరేలా చేయడం ఖాయం అని టీమ్ చెబుతోంది. ప్రతి 10 నిమిషాలకు ఓసారి యాక్షన్ విన్యాసాలతో ప్రభాస్ ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. మేకింగ్ విజువల్స్- ట్రైలర్ తోనే ఆ సంగతి అర్థమైంది. అయితే అంత సీరియస్ మోడ్ లో కథ సాగుతున్నప్పుడు అప్పుడప్పుడు రిలీఫ్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా? అందుకే సాహో చిత్రంలో మూడు పాటలు ఉంటాయట.

నిజానికి సుజీత్ తొలుత పాటలు అవసరమా? అనుకుని ఉండాలి. కానీ భారీ యాక్షన్ చిత్రంలో లవ్ ట్రాక్ తో పాటు స్పైసీ ఎలిమెంట్స్ అవసరం అనుకుని వీటిని చేర్చారేమో. కథనాన్ని ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా మూడే మూడు పాటల్ని ప్లాన్ చేశారు. అందులో సైకో సయ్యాన్.. ఎన్నయ్ సోని.. పాటల్ని శ్రద్ధాపైనే తెరకెక్కించారు. ఇక మూడో పాట `బ్యాడ్ బోయ్.. `ను శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ పై అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు.

తాజాగా ఈ సాంగ్ వీడియో రిలీజైంది. ఈ వీడియో ఆద్యంతం డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ మూవ్ మెంట్స్ తో పాటు జాక్విలిన్ కిర్రెక్కించే ఊప్స్ మాస్ ఆడియెన్ కి స్పెషల్ ట్రీటివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బీ-సీ కేంద్రాల్లో బెంచీ – నేల క్లాస్ నుంచి విజిల్స్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. లిరిక్ కానీ.. పాడిన విధానం కానీ వినేందుకు అద్భుతంగా లేకపోయినా విజువల్ గా చిత్రీకరించిన స్టైల్ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. బులుగు జిలుగు సముద్రం ఒడ్డున.. కొండల నడుమ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్ మోడల్స్ తో డార్లింగ్ రొమాన్స్ మామూలుగా లేదు. అందగత్తెల నడుమ జాకీ ఒంటి విరుపులు కవ్వింత పిచ్చెక్కించడం ఖాయం. బోల్డ్ లుక్ లో జాకీ అందచందాలు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం యువతరంలో ఈ వీడియో సాంగ్ దూసుకెళుతోంది. ఆగస్టు 30న పెద్ద తెరపై జాకీ మేనివిరుపుల ట్రీట్ ఫ్యాన్స్ కి వెరీ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఏక్ దో తీన్.. సాంగ్ తర్వాత మళ్లీ `సాహో`లో అంతే వేడెక్కించే లుక్ తో మైమరిపిస్తోంది జాకీ.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home