సెన్సార్ రిపోర్ట్ : డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ

0

జస్ట్ ఇంకో డబుల్ సెంచరీ గంటలు గడిస్తే చాలు సాహో రికార్డుల ఊచకోత మొదలువుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. 171 నిమిషాల 52 సెకండ్ల ఫైనల్ వెర్షన్ ని లాక్ చేస్తూ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేశారు. ముందు నుంచి లీక్స్ లో ఉన్నట్టు 3 గంటల నిడివికి కేవలం 8 నిముషాలు మాత్రమే తక్కువ సాహో వెండితెర సందడి ఉండబోతోందన్న మాట. ఈ లెక్కన ఇంత లెంత్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంటే రచ్చ మాములుగా ఉండదుగా. సో ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే.

ఇప్పుడు సెన్సార్ పక్కగా వచ్చేసింది కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్లు ఒక్కటి వచ్చేస్తే చాలు ఆన్ లైన్ బుకింగ్స్ షురు అవుతాయి. ఇప్పటికే ఎగ్జిబిటర్లు వాటి కోసమే ఎదురు చూస్తున్నారు. కరెంట్ బుకింగ్ కన్నా ముందే తమ ఎకౌంటుల్లో సాహో ఎంత తెస్తాడో అనే లెక్కల్లో బిజీగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో విడుదల కాబోతున్న సాహో ఫైనల్ కౌంట్ ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో అభిమానులు పది వేల స్క్రీన్లని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

29న ప్రీమియర్ల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదే రోజు రాత్రి నుంచే షోలు ఉంటాయనే టాక్ బలంగా ఉంది. సెన్సార్ అధికారులు సాహో చూసాక ఎలాంటి రియాక్షన్లు ఇచ్చారన్న ఉత్కంట కూడా అభిమానుల్లో ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ ను అలా చూస్తూ ఉండిపోయి తెలుగు సినిమా ఈ స్థాయిలో రావడం గురించి ప్రత్యేక అభినందనలు తెలిపారన్న ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే బాహుబలి 2ని టార్గెట్ చేసిన సాహో అది రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదు
Please Read Disclaimer