ప్రభాస్ సత్తాకు నిదర్శనం ఇది

0

`బాహుబలి` ముందు.. బాహుబలి తరవాత టాలీవుడ్ రేంజును చూడాల్సి ఉంటుంది. బాహుబలి స్టార్ గా ప్రభాస్ మార్కెట్ స్థాయి పెరిగింది. దానికి తగ్గట్టుగానే `సాహో` వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడులో వసూళ్లు ఆనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయినా వరల్డ్ వైడ్గా 424 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 424 కోట్లు గ్రాస్.. 232.6 కోట్ల షేర్ని సాధించింది.

దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యత భారీ స్థాయిలో నిర్మించిన `సాహో` వీక్ కంటెంట్ తీవ్రంగా నిరాశపరిచినా ఈ స్థాయి వసూళ్లు రావడం విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 138 కోట్లు రాబట్టడమే గాక.. ఇక వరల్డ్ వైడ్ ఫుల్ రన్ షేర్ 232.6 కోట్ల షేర్ సాధించింది. ఇదేమీ ఆషామాషీ షేర్ కాదన్నది ఓ విశ్లేషణ. ఇక హిందీ బాక్సాఫీస్ వద్ద సాహో మిరాకిల్స్ చేసిందన్నది ట్రేడ్ రిపోర్ట్.

సాహో క్లోజింగ్ ఫైనల్ ఫిగర్స్ ఇలా వున్నాయి. ఆంధ్రా -41.7 కోట్లు.. సీడెడ్ – 12.38.. తెలంగాణ – 29.52 కోట్లు.. కర్ణాటక-16.75.. తమిళనాడు- 6.05.. కేరళ – 1.60.. రెస్టాఫ్ ద ఇండియా (హిందీ) – 85.95 కోట్లు.. యుఎస్ ఎ.. కెనడా – 13 కోట్లు.. యుఏఈ గల్ఫ్- 12.10.. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్- 2.85.. రెస్ట్ ఆఫ్ ఏషియా – 5.90.. యూరప్-3.15.. రెస్టాఫ్ ది వరల్డ్ -1.60 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన మొత్తం షేర్ 232.6 కోట్లు. ఇండియా మొత్తం టోటల్ – 194 కోట్ల షేర్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 83.65 కోట్ల షేర్ ని సాధించింది. ఈ స్థాయిలో ఈ ఏడాది భారీ వసూళ్లని సాధించిన తొలి చిత్రంగా `సాహో` రికార్డుని సాధించింది ప్రధమ స్థానంలో నిలిచింది. 2019 బెస్ట్ చిత్రంగా సాహో నిలిచింది.