సాహో సంగీత దర్శకుడిపై లైవ్ ఎటాక్

0

గురు రంధవా.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ `సాహో` సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ అంటే వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ కి స్ట్రైక్ అవుతుంది. ప్రభాస్ `సాహో` కోసం గురు రంధవా `ఏ చోట నువ్వున్నా..` అనే పాటకు బాణీ అందించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నారు. 2019 మోస్ట్ అవైటెడ్ `సాహో` కంపోజర్ గా ఇప్పటికే అతడి పేరు తెలుగు రాష్ట్రాల్లో పాపులరవుతోంది.

అయితే గురు వేరొక ఊహించని కారణంతోనూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు. గురూపై కెనడాలో ఎటాక్ జరిగింది. అతడి నుదుటి పై గాయం అయ్యింది. దానికి నాలుగు కుట్లు కూడా వేశారు డాక్టర్లు. కెనడాలో ఓ లైవ్ కాన్సెర్ట్ చేస్తుండగా అతడిపై కొందరు ఎటాక్ చేశారట. ఇంతకీ ఎటాక్ చేయడానికి కారణమేంటి? అంటే.. షాకింగ్ రీజన్ తెలిసింది.

గురూ కెనడా వాంకోవర్ లో లైవ్ కాన్సెర్టులో పాల్గొనేందుకు వెళ్లారు. స్టేజీపై అతడు లైవ్ షో ఇవ్వాల్సి ఉంది. అయితే అతడిని లోనికి వెళ్లకుండా గార్డులు ఆపేశారు. అక్కడ జరిగిన ఘర్షణలోనే అతడికి గాయాలయ్యాయట. ఆ ఘటన అనంతరం ప్రధమిక చికిత్స పొంది ఇండియాకి వచ్చేశాడు. ప్రస్తుతం అతడు గాయాల భారి నుంచి కోలుకుంటున్నానని తెలిపాడు. ఇన్ స్టాలో ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటో చూస్తుంటే అతడి ముఖంపై పిడిగుద్దులు పడ్డాయని అర్థమవుతోంది. గురూ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Please Read Disclaimer