పంజాబీలో సాహో.. ట్విట్టర్ ఈమోజీనా?

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వారం రోజులు అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ `సాహో` ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతోంది? బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తుందా లేదా? అంటూ ఫ్యాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్లో ఒకటే ఆసక్తి నెలకొంది. ఇటు దక్షిణాది- అటు ఉత్తరాది అన్నిచోట్లా అత్యంత భారీగా రిలీజవుతోంది. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడంలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అటు పంజాబీలోనూ బాహుబలిని మించిన క్రేజుతో సాహో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

బాహుబలి చిత్రానికి పంజాబీలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రభాస్ కి వీరాభిమానులేర్పడ్డారు. పంజాబ్ లో ఇంటీరియర్ లో.. చిన్న నగరాల్లోనూ రిలీజ్ చేసేందుకు భారీగా స్క్రీన్లను రెడీ చేస్తున్నారట. అయితే స్క్రీన్లు రెడీ చేయడం అంటే మెట్రో నగరాల్లో అయితే చాలా చోట్ల ఐమ్యాక్స్ తరహా స్క్రీన్ ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక `సాహో` ఖాతాలో తాజాగా మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. `సాహో`కు ట్విటర్ ఈమోజీ వచ్చింది. ట్విట్టర్ లో ఈమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా `సాహో` రికార్డులకెక్కింది. తమిళంలో కాలా-సర్కార్ చిత్రాలకు ఈ తరహాలో ట్విట్టర్ ఈమోజీ లభించింది. బాలీవుడ్ లో జీరో- సుల్తాన్ చిత్రాలకు ఈమోజీలు దక్కాయి. ఇక తెలుగులో మాత్రం తొలిసారి ప్రభాస్ సినిమాకే ఆ ఛాన్స్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వేలు పైగా స్క్రీన్లలో `సాహో` చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈనెల 30న సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer