సాహో ఎఫెక్ట్ సైరా పై పడుతుందా??

0

అందరూ ఎంతగానో ఎదురు చూసిన ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. మెజారిటీ రివ్యూస్ లో ‘సాహో’ కు 2 రేటింగ్ దాటలేదు. మౌత్ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. నిజానికి ఈ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ చాలామందిని షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓ రేంజ్ లో ప్రభంజనం ఉండేది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ‘సాహో’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా సత్తా చాటుతుంది అనేది మొదటి వారాంతం గడిస్తే కానీ చెప్పలేం.

ఇదిలా ఉంటే ఈ సినిమా టాక్.. రిజల్ట్ రెండూ మరో భారీ టాలీవుడ్ సినిమా ‘సైరా’ పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదనే చర్చలు సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ కూడా ‘సాహో’ తరహాలో ప్యాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న చిత్రం. ‘సైరా’ సినిమా బడ్జెట్ రికవర్ కావాలంటే తెలుగులో మాత్రం సూపర్ హిట్ అయితే సరిపోదు. ఖచ్చితంగా ఇతర భాషలలో కూడా భారీ విజయం సాధించాల్సిందే. ఇప్పుడు ‘సాహో’కు వచ్చిన టాక్ తో హిందీ ప్రేక్షకులకు ‘సైరా’ పై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరో విషయం ఏంటంటే.. ప్రభాస్ కు హిందీ ఆడియన్స్ లో ఉన్న గుర్తింపు వేరు.. చిరంజీవికి హిందీ ప్రేక్షకుల్లో అలాంటి క్రేజ్ లేదు. మరి క్రేజ్ లేకుండా ఉండడం.. ‘సాహో’ కు నెగెటివ్ టాక్ రావడం లాంటివి ‘సైరా’ కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

అయితే ‘సాహో’ కంటెంట్ విషయంలో నిరాశపరిచిందనేది అందరూ చెప్తున్నమాట. మరి ‘సైరా’ కంటెంట్ కనుక ప్రేక్షకులను మెప్పించగలిగితే ఈ నెగెటివిటీని అధిగమించే అవకాశం ఉంటుంది. కంటెంట్ విషయంలో తేడా వస్తే మాత్రం కష్టమే. తెలుగు వరకూ ప్రేక్షకులు కాస్త కనికరిస్తారేమో కానీ హిందీ ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ‘సైరా’ కు ఇది నిజంగా పెద్ద టెస్టే!
Please Read Disclaimer