సెలబ్రిటీలు కూడా సాహో అంటున్నారే!

0

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సాహో’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ క్రేజ్ ఉండడంతో సినిమాను చూసేందుకు సినీప్రియులు రెడీ అవుతున్నారు. #సాహో ఫీవర్ ఎవిరివేర్ అనే హ్యాష్ టాగ్ జోరుగా ట్రెండ్ అవుతుందంటే ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థం అవుతుంది.

సాధారణ ప్రేక్షుకులే కాకుండా సెలబ్రిటీలు కూడా ‘సాహో’ పై ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు ‘సాహో’ పై ట్వీట్లు కూడా చేయడం గమనార్హం. సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా “పరిశ్రమలో ఇలా జరగడం ఇది మొదటిసారి. మొత్తం ఇండస్ట్రీ అంతా ప్రియమైన డార్లింగ్ సినిమా ‘సాహో’ ఘన విజయం సాధించాలని.. అన్నీ రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటోంది. డియరెస్ట్ ప్రభాస్ కు ఇవే నా అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.

ఇక యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ “యూవీ క్రియేషన్స్.. సుజీత్ టీమ్ ఈ సినిమాపై పెట్టిన ఎఫర్ట్స్ ఎలాంటివో నేను టాక్సీవాలా సమయంలో స్వయంగా చూశాను. ఈ సినిమా ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేచి చూస్తున్నా. ప్రభాస్ అన్న.. మిగతా టీం అందరికీ నా లవ్” అంటూ ట్వీట్ చేశాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “సాహో టీమ్ అందరికీ అల్ ది బెస్ట్. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కు మంట పెట్టడం ఖాయం” అంటూ ట్వీట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ “సాహో టీమ్ కు అల్ ది వెరీ బెస్ట్. మీ పట్టుదల.. శ్రద్ధ ఒక బ్లాక్ బస్టర్ గా మారతాయని ఆశిస్తున్నాను. యూవీ క్రియేషన్స్.. సుజిత్.. జిబ్రాన్.. శ్రద్ధా కపూర్.. ప్రభాస్ అన్న” అంటూ విషెస్ చెప్పాడు.

శ్రీనివాస్ అవసరాల తన ట్విట్టర్ ఖాతా ద్వారా “ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. సాహో టీమ్ కు అల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశాడు.

న్యాచురల్ స్టార్ నాని “ప్రభాస్ అన్న.. సుజిత్.. సాహో టీమ్ అందరూ సిల్వర్ స్క్రీన్ కు మంట పెట్టండి. సినిమాను మిస్ అవుతున్నా. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత చూస్తా.”

హీరో నితిన్ “డార్లింగ్ ప్రభాస్.. డైరెక్టర్ సుజిత్.. సాహో టీమ్ అందరికీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మీరు ఈ సినిమాకోసం పడిన కష్టానికి.. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవడానికి పడిన తపన గొప్పది. సినిమాను చూసేందుకు ఎదురు చూస్తున్నాను.”

ఇంకా చాలామంది హీరోలు.. హీరోయిన్లు ‘సాహో’ ను చూడాలని ఉందంటూ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడం గమనార్హం.
Please Read Disclaimer