సాహో ఫస్ట్ డే కలెక్షన్స్

0

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో అత్యంత ఆసక్తి కలిగించిన చిత్రం ‘సాహో.’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ను దాటగలిగే సత్తా ఉన్న చిత్రమని అంచనాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి 2’ కలెక్షన్లకు ఆమడ దూరంగా ఆగిపోయింది. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఒకటి అరా ఏరియాల్లో క్రాస్ చేసినప్పటికీ ఒవరాల్ గా డే 1 కలెక్షన్స్ లో ‘బాహుబలి 2’ తర్వాత స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

‘సాహో’ హిందీ వెర్షన్ మొదటి రోజు 24 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది నెట్ కలెక్షన్ ఫిగర్… షేర్ ఫిగర్స్ ఇంకా తక్కువ ఉంటాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన హిందీ సినిమాలలో సల్మాన్ ఖాన్ ‘భారత్’ 42.30 నెట్ వసూళ్ళతో మొదటి స్థానంలో నిలవగా అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ రూ. 29.16 కోట్ల నెట్ కలెక్షన్స్ తో రెండవ స్థానంలో నిలిచింది. సాహో 24 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ తో మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఓవర్సీస్ విషయానికి వస్తే మొదటి రోజు కలెక్షన్స్ వన్ మిలియన్ డాలర్ మార్క్ దాటలేకపోయింది. ‘స్పైడర్’.. ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్ ‘సాహో’ కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. రూ. 36 కోట్ల షేర్ తో హయ్యస్ట్ నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి'(రూ.27 కోట్లు) పేరిట ఉంది. అయితే నైజాం.. నెల్లూరులో మాత్రం ‘బాహుబలి 2’ రికార్డులను క్రాస్ చేసింది.

ఈ కలెక్షన్స్ ఎక్కువే అయినప్పటికీ ‘సాహో’ సినిమా బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ కోణంలో చూస్తే మాత్రం తక్కువే. పాజిటివ్ టాక్ వస్తే పరిస్థితి వేరేగా ఉండేది కానీ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మొదటి వారాంతం లో ఎడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి కాబట్టి ఎలాగో నెట్టుకొచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద సోమవారం పరీక్షను ఎదుర్కోవడం కష్టమయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా పరిస్థితి ఆశాజనకంగా లేనట్టే.

రెస్ట్ ఆఫ్ ఇండియా.. కర్ణాటక.. తమిళ.. మలయాళ వెర్షన్ కలెక్షన్ డీటైల్స్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలను ఒక్కసారి చూడండి.

నైజామ్: 9.41 cr

సీడెడ్: 4.43 cr

ఉత్తరాంధ్ర: 4.32 cr

కృష్ణ: 2.53 cr

గుంటూరు: 4.72 cr

ఈస్ట్ : 4.46 cr

వెస్ట్: 3.59 cr

నెల్లూరు: 2.58 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 36.04 cr
Please Read Disclaimer