సాహో ఫస్ట్ షో ఎన్ని గంటలకు ?

0

ఎదురుచూస్తున్న ఘడియలు రానే వస్తున్నాయి . సాహో కోసం కాపు కాచిన వెయిటింగ్ కు ఫైనల్ కార్డ్ పడబోతోంది. ఇంకో నాలుగు రోజులు గడిస్తే చాలు థియేటర్ల దగ్గర జాతర్లు టికెట్ల కోసం కొట్టుకోవడాలు కన్పించనున్నాయి. అయితే ఇప్పటిదాకా సాహో బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షోలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అధికారికంగా బయటికి రాలేదు.

ప్రాధమిక సమాచారం మేరకు ఎపిలో తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో షోలు మొదలుకావడం దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చక్కర్లు కొడుతోంది. తెలంగాణాలో వేయడం గురించి ఇంకా క్లారిటీ లేదు. అనుమతులు రాకపోవడం పక్కా అయితే 8 నుంచి స్టార్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాని ఆలోగానే ఆంధ్రప్రదేశ్ నుంచి రిపోర్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి సోషల్ మీడియాలోనో ఆన్ లైన్ లోనో వాటి గురించిన లీక్స్ తెలిసిపోతాయి

ముందు రోజు రాత్రి సెకండ్ షో తరహాలో బెనిఫిట్ ప్రదర్శన గురించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. దీని వల్ల కలిగే లాభనష్టాలు లెక్కవేసే పనిలో యువితో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్టు సమాచారం. ఓ కంక్లూజన్ కు వచ్చాక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే అర్ధరాత్రి దాటడం ఆలస్యం సాహో అప్ డేట్స్ తో నెట్ ఊగిపోతుంది. పూర్తి క్లారిటీ లేక అభిమానులు సైతం కొంత అయోమయంలో ఉన్నారు. టికెట్ ధరలు ఏపిలో మాత్రమే పెంచడం ఇప్పటికే హాట్ న్యూస్ గా మారింది. టాలీవుడ్ అతి పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఈ మాత్రం హడావిడి ఉత్సుకత ఉండటం సహజం. ఈ నాలుగు రోజులు హైపర్ టెన్షన్ తో మూవీ లవర్స్ కు నిద్రపట్టడం కూడా కష్టమే అనేలా ఉంది పరిస్థితిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home