2019 కలెక్షన్స్.. సాహోకు ఇదే పోటీ

0

సాహో.. సాహో.. ఈనెల 30న విడుదలయ్యే ప్రభాస్ సినిమా కోసం ఇప్పుడు యావత్ దేశం ఎదురుచూస్తోంది. దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. దానికి తగ్గట్టే యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్లలో అద్భుతంగా చూపించారు. మరి సినిమా అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది వేచిచూడాలి.

సాహో దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తీసిన మూవీ ఇదీ. దీంతో దేశంలోని ప్రధానమైన నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు 2019 ఈ సంవత్సరం దేశంలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీ ప్రభాస్ ‘సాహో’ నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. సినిమా బాగుంటే మాత్రం కలెక్షన్లు వరదలా రావడం ఖాయం.

అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు 2019లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు బాలీవుడ్ వే. తీవ్ర వివాదాలు కొనితెచ్చుకున్న కబీర్ సింగ్ మూవీ ఈ సంవత్సరం బాలీవుడ్ అత్యధిక కలెక్షన్లతో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. మన తెలుగు డైరెక్టర్ తీసిన అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ ‘కబీర్ సింగ్’ దాదాపు 273 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పుడు సాహో మొదటి టార్గెట్ ఈ మూవీనే. కబీర్ సింగ్ తర్వాత దేశభక్తి చిత్రం ఉరి-250కోట్లు సల్మాన్ ‘భారత్ -201’కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు మిషన్ మంగళ్-160 కోట్లు కేసరి -151.5 కోట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరి ఇప్పుడు సాహో ఫస్ట్ టార్గెట్ మన అర్జున్ రెడ్డి రిమేక్ మూవీ ‘కబీర్ సింగ్’ అన్నమాట.. ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడానికి ప్రభాస్ సాహో ముందుగా కబీర్ సింగ్ మూవీని దాటేయాలి.. ఆ తర్వాత సినిమా ఫలితాన్ని బట్టి ఎంత మేరకు ముందుకు సాగుతుందో చూడాలి మరీ.
Please Read Disclaimer