‘సాహో’ నాలుగు రోజుల కలెక్షన్స్.!

0

రివ్యూ రైటర్లు కాలదన్నినా.. విమర్శకులు సాహో బాగా లేదన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం సాహోకు మంచి కలెక్షన్లు రావడం విశేషం. అయితే ఇదంతా వరుస సెలువుల కారణంగా అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్ష్. తాజాగా ఆయన చెప్పిన వివరాల ప్రకారం సాహోకు మిశ్రమ స్పందన వచ్చినా అది కలెక్షన్లపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదని అర్థమవుతోంది.. ఓవరాల్ గా మొదటి మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటినట్లు సమాచారం. ఓవర్సీస్ లోనే 8 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిందట..

శుక్రవారం విడుదలైన సాహో కొంచెం నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే శని ఆదివారాలు సెలవులు కావడం.. సోమవారం కూడా వినాయక చవితితో సెలవులు ఉండడంతో ఖాళీగా ఉన్న జనాలంతా థియేటర్ల బాట పట్టి సినిమా చూడడంతో ఈ మాత్రం వసూళ్లు సాధ్యామయ్యాయట.. సెలవుల టైమింగ్ సాహోకు కలిసి వచ్చిందంటున్నారు.

నాలుగురోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో షేర్ 67.35 కోట్లకు చేరినట్టు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయిన మొత్తం బిజినెస్ 188 కోట్లు కాగా ఆ మొత్తానికి ఇంకా చేరుకోలేదు ఇక హిందీ విషయానికి వస్తే సోమవారం బాలీవుడ్ హిందీ మార్కెట్ లో సాహో వసూళ్లు ఘననీయంగా తగ్గాయి.కేవలం సోమవారం 14.20 కోట్లే గ్రాస్ వసూలైనట్టు క్రిటిక్ తరుణ్ ఆదర్స్ ట్వీట్ చేశాడు. సాహో మొదటి రోజు హిందీ మార్కెట్ లో 24.40 కోట్ల గ్రాస్ – రెండోరోజు శనివారం 25.20 కోట్ల గ్రాస్ – ఆదివారం రూ.29.48 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొత్తం హిందీ వర్షన్ తొలి నాలుగు రోజుల్లో వసూలు చేసింది రూ.93.28 కోట్ల గ్రాస్ అని తరుణ్ ఆదర్ష్ తెలిపాడు.

నెగెటివ్ టాక్ దృష్ట్యా మంగళవారం నుంచి ఇన్ని వసూళ్లు కష్టమేనంటున్నారు క్రిటిక్స్. ఈరోజు సెలవు లేకపోవడంతో మంగళవారం నుంచి వచ్చే కలెక్షన్ల మీద సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం నాలుగు రోజుల గ్రాస్ కలెక్షన్లు 200 కోట్లు దాటినట్టేనట్టేనని సినిమా క్రిటిక్స్ అంచనావేస్తున్నారు.




Please Read Disclaimer