సాహో జంట ఎంత క్యూటో

0

ముందు అనుకున్న తేదీని రెండు వారాలు వాయిదా వేశాక సాహో టీమ్ అధికారికంగా ప్రకటన ఇవ్వడం తప్ప ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. ఆ కొరతను తీరుస్తూ కొత్త డేట్ ఆగస్ట్ 30ని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ప్రభాస్ శ్రద్ధా కపూర్ ల స్వీట్ రొమాన్స్ ని కేవలం సైడ్ కట్ లో చూపించిన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స ద్వారా చూపిస్తూ క్లోజ్ అప్ రూపంలో రివీల్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. సందర్భం చూస్తే ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ పాట అని ఈజీగా అర్థమైపోతోంది. ఇప్పటిదాకా యాక్షన్ మసాలా పోస్టర్లతో రచ్చ చేసిన యువి సంస్థ మొదటిసారి ఓ కూల్ అండ్ స్వీట్ స్టిల్ తో డార్లింగ్ ఫాన్స్ కి కానుక ఇచ్చింది.

విశేషం ఏంటంటే ఇందులో కూడా సంగీత దర్శకుడి పేరు లేదు. ఒక్కో పాటను ఒక్కో కంపోజర్ ట్యూన్ చేస్తున్న నేపథ్యంలో అందరి పేర్లు పట్టవని ఎవరిది పొందుపరచలేదు. ఆఖరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్న జిబ్రాన్ కూడా పోస్టర్ లో లేడు. ఇదిలా ఉండగా ఆగస్ట్ 30 పక్కా లాక్ అయిపోయింది కాబట్టి ప్రీ ప్రమోషన్ పెంచాల్సి ఉంది . ఈ వారం పూర్తయితే కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉంటుంది.

పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈవెంట్లు చేయాల్సి ఉంటుంది. మీడియాతో ఎన్ని ఇంటరాక్షన్లు పెట్టాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఇకపై ఓ నలభై రోజులు యువి టీమ్ మొత్తానికి కునుకు పట్టడం కూడా కష్టమే. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటున్న సాహోలోని రెండో ఆడియో సింగల్ ఇంకో నాలుగైదు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇండియన్ మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సాహోలో సాఫ్ట్ యాంగిల్ ని ఈ పోస్టర్ ని రివీల్ చేసిన టీమ్ కొత్త అంచనాలకు తెరతీసింది
Please Read Disclaimer