సాహో బెనిఫిట్ షోలు ఫిక్స్ ?

0

ఇంకో 12 రోజుల్లో రాబోయే సాహో కోసం సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే ప్రమోషన్ ఊపందుకోగా రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అది పీక్స్ కు చేరనుంది. ఇదిలా ఉండగా సాహో బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఒకరోజు ముందుగానే అంటే 29 రాత్రి ఎంపిక చేసిన కేంద్రాల్లో థియేటర్లలో సాహో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్టు సమాచారం. టికెట్ ధర 500 రూపాయలతో మొదలవుతుందని వినికిడి.

దీనికి సంబంధించి అనుమతుల కోసం ఇప్పటికే యూనిట్ తరఫున ప్రభుత్వాలకు అభ్యర్థన వెళ్లిందని అనుమతి రాగానే ప్రకటిస్తారని తెలిసింది. ఈసారి ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఇలాంటి షోలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక్క బాహుబలి 2కు మాత్రమే గతంలో ఇలాంటి స్క్రీనింగ్ సాధ్యపడింది. కానీ చాలా తక్కువ స్క్రీన్లు ఇవ్వడం పట్ల అధిక శాతం ఒకరోజు ముందు చూడలేకపోయారు

సో ఇప్పుడీ వార్త నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రపంచంలో అందరి కంటే ముందే సాహో చూసేయొచ్చన్న మాట. ఆ షోతో మొదలై మిగిలిన చోట్ల తెల్లవారుఝాము నుంచి సాహో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. 500 కాదు వెయ్యి రూపాయలు పెట్టినా ఫ్యాన్స్ కొనేలా ఉన్నారు. అసలే బాహుబలి తర్వాత రెండేళ్ల గ్యాప్. అందులోనూ రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన విజువల్ వండర్. ఈ మాత్రం హైప్ ధర కామనే అనుకునే వాళ్ళు ఉండకపోరు. అందుకే అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. 30న తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది స్టేట్స్ లోనూ సాహోని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
Please Read Disclaimer