సాహో సుందరిని ఇలా చూపిస్తారా

0

బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో పాటు గ్లామరస్ హీరొయిన్ గానూ చాలా పేరున్న శ్రద్ధా కపూర్ ని సాహో హీరొయిన్ గా ఎంపిక చేసినప్పుడు దర్శకుడు సుజిత్ ని అందరూ మెచ్చుకున్నవాళ్ళే. స్వతహాగా మంచి టాలెంట్ ఉన్న శ్రద్ధా సాహోకు పెద్ద ప్లస్ అవుతుందనే అంచనా ఇవాళ కొంత తప్పిన్నట్టు కనిపిస్తోంది. తన పాత్రకు ఇంట్రో ఇవ్వడం దగ్గరి నుంచి పాత్రను డిజైన్ చేయడం దాకా సుజిత్ చేసిన ఎన్నో తప్పుల వల్ల చాలా పవర్ ఫుల్ గా ఉండాల్సిన అమృతా నాయర్ చివరికి హీరో ప్రేమ కోసం పరితపించి తన మోరల్స్ ను మర్చిపోయేంత వీక్ గా ప్రవర్తించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన మాట వాస్తవం.

టీజర్ లో ఎవరు వాళ్ళు అంత వయోలెంట్ గా ఉన్నారు అని అడిగే డైలాగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో బాగా రిజిస్టర్ అయిన శ్రద్ధా ఆ బిల్డప్ కు తప్ప స్పాన్ సినిమాలో లేకపోవడం అసలు ట్విస్ట్. ఒకరకంగా చెప్పాలంటే శ్రద్ధాకు ఇది బెస్ట్ సౌత్ డెబ్యుగా నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ముంబై మీడియా సాహో మీద బాణాలు ఎక్కుపెట్టి మరీ వదులుతోంది. అందులోనూ శ్రద్ధా బాలీవుడ్ బ్యూటీ కావడంతో ఈ డోస్ ఇంకాస్త ఎక్కువగా ఉంది.

దీని కోసమే కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకుని మరీ బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కు వ్రతం చెడినా ఫలితం దక్కేలా లేదు. ప్రభాస్ పాత్ర తీరుతెన్నుల మీదే విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇంత కన్నా హీరొయిన్ రోల్ నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది. అయినా శ్రద్ధకున్న కమిట్ మెంట్స్ చూస్తుంటే సాహో ఫలితంతో సంబంధం లేకుండా నార్త్ లోనే తను విపరీతమైన బిజీలో ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా కనిపించకపోవచ్చు
Please Read Disclaimer