రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లో యూవీ?

0

`బాహుబలి` వంటి సంచలన విజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం `సాహో`. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 350 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్ని తలపించేలా రూపొందించింది. `ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్` చిత్రాల సాంకేతికతను ఉపయోగించడం మరో హైలైట్. ట్రైలర్ సహా మేకింగ్ వీడియోలు క్రేజు పెంచాయి. అందుకు తగ్గట్టే సాహో బిజినెస్ కి క్రేజు పెరిగింది. `బాహుబలి` క్రేజ్ నే బిజినెస్ పరంగా సాహో అందుకుందని చర్చ సాగుతోంది.

`బాహుబలి` స్టార్ గా ప్రభాస్ పై వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని యూవీ క్రియేషన్స్ సంస్థ 350 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసింది. అయితే ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా? అని చాలా మందిలో అనుమానం వుంది. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ `సాహో` ఇప్పటికే 320 కోట్ల మేరకు బిజినెస్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. యువీ సేఫ్ జోన్ లోకి రావడానికి మరో 30కోట్లు రావాలి. ఆల్ రైట్స్ రూపంలో ఇప్పటికి `సాహో` మేకర్స్ కి వచ్చిన మొత్తం 320 కోట్లుగా ఉంటే… దేశ వ్యాప్తంగా క్రేజు వున్నా ఇంకా 30 కోట్లు డెఫిసిట్ ఉందన్న ప్రచారం సాగుతోంది.

అయితే ఈ డెఫిసిట్(లోటు) ని శాటిలైట్ రైట్స్ లేదా ఇతరత్రా మార్గాల ద్వారా రికవరీ అయ్యే ఛాన్సుందట. ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి రోజే `తెలుగు సినిమా` సత్తా ఏంటో చూపించబోతోందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. తొలుత అనుకున్న తేదీ నుంచి వాయిదా వేసిన మేకర్స్ ఆగస్టు 30ని ఎంచుకోవడంలోనే ఏ స్థాయిలో ఓపెనిగ్స్ ని అంచనా వేస్తున్నారో ఊహించవచ్చు. `సాహో` తొలి రోజు రికార్డులు.. తొలి వీకెండ్ రికార్డులపైనా అంచనాలున్నాయి. మరి వాటిని ఏమేరకు అందుకుంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer