వాళ్లు సాహోను కూడా వదలడం లేదు

0

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు అంటే ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇండియాలోనే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ముఖ్యంగా జపాన్ సినీ ప్రేమికులు ప్రభాస్ ను తెగ ప్రేమిస్తున్నారు. ఆమద్య జపాన్ నుండి ప్రభాస్ ను చూసేందుకు రావడం.. ప్రభాస్ బర్త్ డే వేడుకను జపాన్ లో జరుపుకోవడం వంటివి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

జపాన్ వారు ఇతర దేశాల్లో ప్రభాస్ ను చూసినా కూడా వెళ్లి సెల్ఫీ లు తీసుకుంటున్నారు. అంతగా జపనీస్ ప్రభాస్ ను ఆరాధిస్తున్నారు అంటే కారణం బాహుబలి అంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే వారి అభిమానం కేవలం బాహుబలికే పరిమితం కాలేదు. ఆమద్య విడుదలైన సాహో చిత్రాన్ని ఈమద్య జపాన్ లో విడుదల చేశారు. ఇంగ్లీష్ మూవీ కాకుండా ఇతర భాషా చిత్రాలు జపాన్ లో చాలా తక్కువగా విడుదల అవుతూ ఉంటారు. అయితే ఈ చిత్రం మాత్రం అక్కడ చాలా ఎక్కువ థియేటర్లలలోనే విడుదల అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమా విడుదల అయితే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తూ చూస్తారో అక్కడ కూడా థియేటర్లలో సాహో చిత్రాన్ని జపనీస్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. జపనీస్ సబ్ టైటిల్స్ తో అక్కడ ప్రేక్షకులు సాహోను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సాహోకు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేదు. కాని హిందీ ప్రేక్షకులు మరియు జపనీస్ ప్రేక్షకులు మాత్రం సినిమాను నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు. ముందు ముందు ప్రభాస్ చేస్తున్న.. చేయబోతున్న సినిమాలకు జపాన్ లో పెద్ద మొత్తంలో బిజినెస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer