సాహో పక్కా రివ్యూ ఆ టైంకే

0

తుఫాను ముందు ప్రశాంతతలా సాహో సునామికి థియేటర్లు ఎదురు చూస్తున్నాయి. ఇంకో రెండు రోజుల్లో కనివిని ఎరుగని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడబోతున్నామన్న ఆతృత సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంది. టాక్ ఎలా ఉంటుంది రివ్యూస్ ఏం చెబుతాయి అనే దాని మీద అభిమానుల ఉత్కంఠ అంతా ఇంతా కాదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి షో ఎక్కడ పడుతుందో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఉదయం 5 గంటలకు ఉండొచ్చనే న్యూస్ పక్కాగా విన్పిస్తోంది కానీ మిడ్ నైట్ షోల కోసం యువి ట్రై చేస్తున్నట్టుగా టాక్ ఉంది.

ఇవన్ని పక్కనపెట్టి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సాహో ఫస్ట్ షో పడేది దుబాయ్ లో. రేపు రాత్రి భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గం 30 నిమిషాలకు సాహో బొమ్మ తెరమీద పడుతుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో వేయబోతున్నారు. కాకపోతే మొదట పడుతోంది మాత్రం హిందీ వెర్షన్. బాష ఏదైనా సినిమా ఒకటే కాబట్టి రిపోర్ట్స్ ని నమ్మొచ్చు. ఈ లెక్కన ఇంటర్వెల్ టైం 10 దాటేస్తుంది. షో పూర్తయ్యేలోపు 12 అవుతుంది. అంటే ఇండియాలో షో పడక ముందే దుబాయ్ ఆడియన్స్ సాహో చూసేసి ఉంటారు.

ఎలాగూ అధిక శాతం చూసేది మన భారతీయులే కాబట్టి సోషల్ మీడియాలోనో ఇంకో రూపంలోనో రిపోర్ట్స్ అందుకోవచ్చు. ఆ టైంకి ప్రభాస్ కూడా ప్రమోషన్ కోసం అక్కడే ఉంటాడు. ప్రీమియర్ అటెండ్ అయ్యాక నేరుగా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత లండన్ ట్రిప్ ఉంటుంది. అసలే నెల రోజుల నుంచి డార్లింగ్ రెస్ట్ లేకుండా డే అండ్ నైట్ విమానాల్లో తిరుగుతూ సాహో ప్రమోషన్ చేస్తున్నాడు. రిజల్ట్ పట్ల నిర్మాతల కంటే తనకే టెన్షన్ ఎక్కువగా ఉంది. సో ఇది తీరే టైం ఎక్కువ లేదు కానీ రేపు అర్ధరాత్రికి క్లారిటీ వచ్చేస్తుందిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home