సాహో రన్ టైం లాక్ చేస్తున్నారా ?

0

సరిగ్గా ఇంకో 33 రోజుల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సాహో ధియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే అభిమానులకు కౌంట్ డౌన్ తోనే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇటీవలే రిలీజైన ఆడియో సింగల్ కు నెగటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్నా మిగిలిన అంశాల గురించి చాలా ధీమాగా ఉన్నారు. మల్టీ లాంగ్వేజ్ మూవీగా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేసిన సాహోకు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ చెన్నైలో జరుగుతోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు సాహో ఫస్ట్ హాఫ్ రన్ టైం లాక్ చేశారట. 1 గంటా 20 నిమిషాలకు ఇంటర్వెల్ పడుతుందని సమాచారం. మాములుగా అయితే ఇది ఎక్కువే. కానీ సాహోలో ఉన్నది ప్రభాస్. 200 కోట్ల బడ్జెట్. ఇలాంటి ఐ ఫీస్ట్ లాంటి మూవీని ప్రేక్షకులు ఎంతసేపైనా కళ్లప్పగించి చూస్తారు. మెప్పించే కంటెంట్ ఉండాలి అంతే.అందుకే ఎడిటింగ్ ఇక్కడి వరకు అయ్యిందని తెలుస్తోంది.

ఇంటర్వల్ బ్లాక్ కు ముందు వచ్చే ఛేజింగ్ ప్లస్ యాక్షన్ ఎపిసోడ్ సుమారు ఇరవై నిముషాలు ఉంటుందట. మిగిలిన గంటలో పాటలు హీరో ఇంట్రో హీరోయిన్ లవ్ ట్రాక్ వగైరా ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆ లెన్త్ పెద్ద సమస్య కాదు. అయితే సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేసి ఫైనల్ కట్ ఒకసారి చూసుకుని అప్పుడు అంతా బాగుంది అనిపిస్తే ఫైనల్ గా సెన్సార్ కాపీని సిద్ధం చేయబోతున్నారని తెలిసింది.

ఐదు భాషల్లో విడుదల చేస్తున్న మూవీ కాబట్టి సెన్సార్ ఫార్మాలిటీస్ విడివిడిగా చేసుకోవాలి. అందుకే జులై చివరి వారం లోగా ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటే ఇంకే టెన్షన్ ఉండదు. పైగా ఆగస్ట్ మొదటి రెండు వారాలు పూర్తిగా ప్రమోషన్ కే కేటాయించాల్సి ఉంటుంది. సో సాహో అప్ డేట్స్ ఇకపై స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉందన్న మాట
Please Read Disclaimer