కౌగిలింతలోనూ ‘తుపాకి’ విడువరా?

0

ఆ ఇద్దరూ పోలీసాఫీసర్లు. అండర్ కవర్ ఆపరేషన్ కోసం నియమించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్. గన్ చేతపట్టి గుళ్ల వర్షం కురిపించడంలో స్పెషలిస్టులు. శత్రువును వెంటాడి వేటాడి చీల్చి చెండాడుతారు. మాఫియా అండర్ వరల్డ్ అయినా వీళ్ల దెబ్బకు షేకవ్వాల్సిందే. గల్ఫ్ లో 2000 కోట్ల కరెన్సీ చుట్టూ పన్నిన పద్మవ్యూహాన్ని ఈ అండర్ కవర్ ఆపరేషన్ అధికారులు ఎలా ఛేధించారు? అన్నది తెరపైనే చూడాలి.

అంతా బాగానే ఉంది కానీ.. ఆపరేషన్ లో వేరొక ఇన్నర్ ఆపరేషనే ఏంటో కాస్తంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఓవైపు సీరియస్ గా మాఫియా గ్యాంగ్ లతో పోరాడుతూనే ఘాటైన లవ్- రొమాన్స్ తో నానా రచ్చ చేస్తున్నారు ఆఫీసర్స్. ఇదిగో ఏమాత్రం సందు దరికినా ఇలా కౌగిలింతలతో గిలిగింతలు పెడుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే థియేటర్లలో ఆవిరులు పుట్టుకొస్తాయేమో! ఎంత ఘాటు ప్రేమయో వింత మోహమో! అన్నట్టే ఉంది ఈ సీను. అన్నట్టు అంత బిగి కౌగిలిలోనూ `తుపాకి`ని వదలరా? శత్రువు టెన్షన్ విడిచిపెట్టదా? మాఫియాతో పెట్టుకుంటే ఎంతటి ప్రేమికులకు అయినా ఇలాంటి తిప్పలు తప్పవేమో!

ఈ ఆపరేషన్ లో ఆ ఇద్దరు ప్రేమికుల(ప్రభాస్ – శ్రద్ధా)కు చాలానే తంటాలు ఉంటాయని ట్రైలర్ చెప్పేసింది. సాహో చిత్రంలో యాక్షన్ వీఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని మించి స్క్రీన్ ప్లే మాయాజాలం.. ముఖ్యంగా లవ్ స్టోరి కట్టి పడేస్తాయని దర్శకుడు సుజీత్ చెప్పారు. మరి ఆ గమ్మత్తేంటో అసలు గుట్టు ఏంటో తెలియాలంటే ఆగస్టు 30 వరకూ ఆగాల్సిందే. నేటి సాయంత్రం 6 నుంచి రామోజీ ఫిలింసిటీలో సాహో వరల్డ్ డిస్ ప్లే ఉండనుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లక్ష మంది ప్రభాస్ అభిమానుల మధ్య ఘనంగా జరగనుంది.
Please Read Disclaimer