సాహో గేమ్ వచ్చేసింది – అఫీషియల్

0

టాలీవుడ్ ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశపు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సాహో సందడి రోజులు గడిచే కొద్దీ పీక్స్ కు చేరుకుంటోంది. విడుదలకు ఇంకా 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ స్పీడ్ ని పెంచింది. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ నభూతో నభవిష్యత్ అనే తరహాలో ప్లాన్ చేసినట్టు ఇప్పటికే టాక్ ఉంది. గెస్టుల గురించి సైతం సస్పెన్సు అలాగే మైంటైన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సాహో గేమ్ రూపంలో అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. దీనికి సంబంధించిన అప్ డేట్ యూనిట్ గత వారమే ఇచ్చింది. ఫుల్ గేమ్ ని ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే ఇది ప్రస్తుతం యాపిల్ స్టోర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ ఫోన్ వాడుతున్న వారెవరైనా సరే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు అతి త్వరలో ఆండ్రాయిడ్ యుజర్స్ కి అందుబాటులోకి తెస్తామని గేమ్ రూపకర్త పిక్సే లాట్ లాబ్స్ ప్రకటించింది. యుజర్లలో అధికంగా యాండ్రాయిడ్ వాళ్లే ఉంటారు కాబట్టి ఇది త్వరగా విడుదల చేయాలనీ అభిమానులు కోరుతున్నారు.

సాహోలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆధారంగా చేసుకునే ఈ గేమ్ ని రూపొందించారు. చివరి లెవెల్ దాకా వెళ్తే సినిమాలో ఉన్న కొన్ని కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన క్లూస్ దొరకవచ్చు. అందుకే ఫ్యాన్స్ దీన్ని ఆడేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన డార్లింగ్ తిరిగి వచ్చాక హైదరాబాద్ ఈవెంట్ కోసం రెడీ అవుతాడు. ఇంకో రెండు మూడు వారాల దాకా యూనిట్ కు రెస్ట్ లేనట్టే
Please Read Disclaimer