డార్లింగ్ వాచ్ టాక్ ఆఫ్ ది టౌన్

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా జరిపారు. ఎస్ఎస్ రాజమౌళి.. దిల్ రాజు.. అల్లు అరవింద్.. వీవీ వినాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సెలబ్రిటీల స్పీచులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే అందరికంటే ఎక్కువగా నెటిజన్లను ఆకర్షించిన అంశం ప్రభాస్ చేతికి ధరించిన రిస్ట్ వాచ్. ఆ వాచ్ ఎంతో స్టైలిష్ గా కనిపించడంతో కెమెరాలు ఆ వాచ్ ను హైలైట్ చేసింది. ఇక నెటిజన్లు కూడా ఆ వాచ్ బ్రాండ్.. ధర తెలుసుకునేందుకు గూగుల్ ను ఆశ్రయించారు. ప్రభాస్ ధరించిన వాచ్ ఖరీదు యాభై లక్షల పైమాటేనని సమాచారం. హుబ్లో కంపెనీ వారి వాచ్ ఇది. హుబ్లో(Hublot) కంపెనీ వారి బేసిక్ వాచ్ లు ఆరు లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ బ్రాండ్ లో కాస్ట్లీ వాచ్ కోటిన్నర వరకూ ఉంటుంది.

ప్రభాస్ ఈ వాచ్ ధరించాడని తెలియడంతో ఇప్పటివరకూ ఈ బ్రాండ్ పేరు తెలియని వారికి కూడా ఒక్కసారిగా హుబ్లో బ్రాండ్ పరిచయం అయిపోయింది. ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం పీక్స్ లో ఉండడంతో ఏం చేసినా అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సాహో’ రిలీజ్ కు ముందే పరిస్థితి ఇలా ఉంటే.. సినిమా కనుక హిట్ అయితే ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు.
Please Read Disclaimer