‘సాహో’ ఎంత షేర్ రాబడితే హిట్టు?

0

ప్రభాస్ నటించిన `సాహో` బిజినెస్ రేంజ్ ఎంత? అంటే థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ కలుపుకుని దాదాపు 450 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 320 కోట్ల మేర బిజినెస్ జరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ లోనూ శాటిలైట్ – డిజిటల్ ఇవన్నీ కలుపుకుంటే మరో 130 కోట్లు అదనంగా వస్తోందట. ఓవరాల్ గా 440-450 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసే వీలుందన్న సమాచారం అందుతోంది.

ప్రీబిజినెస్ పూర్తి వివరాలు పరిశీలిస్తే.. సాహో తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ 125 కోట్లు.. తమిళం-మలయాళం-కన్నడం కలిపుకుని 50కోట్ల మేర డీల్ సాగిందట. హిందీ రైట్స్ ని రూ.120 కోట్లకు థియేట్రికల్ హక్కుల్ని విక్రయించారు. హిందీ వెర్షన్ శాటిలైట్- డిజిటల్ హక్కులు కలిపి రూ.85 కోట్లకు డీల్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారట. తెలుగు- తమిళం- మలయాళ భాషలకు కలిపి `సాహో` శాటిలైట్- డిజిటల్ హక్కుల్ని గంపగుత్తగా 110కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మొత్తంగా 450 కోట్ల డీల్ పూర్తవుతోందని.. అంటే నిర్మాతలకు రిలీజ్ ముందే 100కోట్ల ప్రాఫిట్స్ దక్కినట్టేనని చెబుతున్నారు.

పెండింగ్ డీల్స్ ఏవైనా రిలీజ్ ముందే పూర్తవ్వాల్సి ఉంటుంది. రిలీజ్ తర్వాత అయితే హిట్టు అన్న టాక్ వస్తే డీల్ విలువ ఇంకా పెరిగే ఛాన్సుంది కాబట్టి ముందే పూర్తి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మూవ్ మెంట్ లో కొనాలంటే ఆ మూడు దక్షిణాది భాషలకు 110 కోట్లలో డీల్ కుదురుతుంది. లేదంటే ఇంకా పెరిగే ఛాన్సుంటుందట. మరి సాహో రిలీజ్ కి ఇంకో 11 రోజుల సమయం ఉంది. ఈలోగా ఇంకేదైనా ప్రీబిజ్ అప్డేట్ తెలుస్తుందేమో చూడాలి. దాదాపు 320 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేస్తోంది కాబట్టి ఆ మేరకు షేర్ థియేటర్ల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. పంపిణీదారులు సేఫ్ అవ్వాలంటే 350 కోట్ల షేర్ రాబట్టాలి. బాహుబలి స్టార్ గా ప్రభాస్ కి ఉన్న క్రేజు దృష్ట్యా ఓపెనింగులు అదరిపోయే ఛాన్సుందని చెబుతున్నారు. ఈ ఊపులో సాహో హిట్టు కొడితే బాహుబలి రేంజు వసూళ్లు తేవొచ్చన్న అంచనాలు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. హిందీలో డే వన్ లో 50 కోట్ల షేర్ తెస్తోందని దర్శకుడు వినాయక్ ప్రీరిలీజ్ వేడుకలో వెల్లడించడాన్ని బట్టి చూస్తుంటే తొలి వీకెండ్ నాటికే హిందీ బయ్యరు సేఫ్ అవుతారనే అంచనాకి రావొచ్చు. ఓవరాల్ రిజల్ట్ విషయంలో యు.వి.క్రియేషన్స్ ఫేట్ ఎలా ఉంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. అన్నిటికీ ఆగస్టు 29 రాత్రి ప్రీమియర్లతోనే క్లారిటీ వచ్చేస్తుందేమో!
Please Read Disclaimer