సాహో కోసం మరో మాహిష్మతి..!

0

ప్రభాస్ ‘సాహో’ విడుదలకు ఇక నెలరోజులు మాత్రమే సమయం ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాలో విశేషాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. తాజాగా ‘సాహో’ సంబంధించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లో ఒక సిటీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ‘సాహో’ లో ఒక మేజర్ షెడ్యూల్ అబుదాబిలో చిత్రీకరించారు కాబట్టి మనం అది అబుదాబి అనే అనుకుంటాం. కానీ అక్కడే ఉంది ట్విస్టు.. అది నిజం కాదు. ఆ సీక్వెన్స్ ను ప్రత్యేకంగా సినిమా కోసం సృష్టించిన కల్పిత నగరంలో చిత్రీకరించారట.

బ్యాట్ మ్యాన్ సీరీస్ లో సినిమాలు చూసిన వారికి గోథం సిటీ పేరు తెలిసే ఉంటుంది. అదో కల్పిత నగరం. సినిమా కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన భవిష్యత్ నగరం. అదే తరహాలో ‘సాహో’ కోసం కూడా డైరెక్టర్ సుజిత్ ఒక ఫ్యూచరిస్టిక్ సిటీని ప్లాన్ చేశాడట. ఆ నగరాన్ని అబుదాబి దగ్గర ఉన్న ఎడారిలో నిర్మించారట. ఈ నగరానికి ఏం పేరు పెట్టారనేది ఇంకా వెల్లడి కాలేదు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో రూ.65 కోట్ల ఖర్చుతో రెండేళ్ళు శ్రమించి ఆ నగరాన్ని తయారు చేయడం జరిగిందట. ఈ సెటప్ కు తోడుగా హై ఎండ్ వీఎఫ్ ఎక్స్ తో ఆ నగరం స్క్రీన్ పై రియల్ గా కనిపించేలా తీర్చిదిద్దారట.

‘వండర్ వుమన్’.. ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్’ సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేసిన డానిలో బోలెటినో.. ‘మగధీర’ వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కన్నన్ ఈ నగరానికి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ వర్క్ బాధ్యతలు చూసుకున్నారట. దాదాపు 300 మంది వీఎఫ్ ఎక్స్ ఆర్టిస్టులు ఈ వర్క్ లో పాలుపంచుకున్నారని సమాచారం. ‘సాహో’ లో ఈ నగరం ఓ మేజర్ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ నగరం ఎలా ఉంటుందో తెలియాలంటే ప్రేక్షకులు ఆగష్టు 30 వ తారీఖువరకూ వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer