లెజెండ్రీ నిర్మాత ఇంట విషాదం

0

మహమ్మారి వైరస్ ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలను బలికొంటూనే ఉంది. ఈ వైరస్ ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన వారిని కూడా పట్టి పీడిస్తూ ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్రీ నిర్మాతగా విజయా నిర్మాణ సంస్థ అధినేత బి నాగిరెడ్డికి పేరుంది. దివంగత బి నాగిరెడ్డి మనవడు అయిన శరత్ రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవలే వైరస్ పాజిటివ్ వచ్చింది.కడప జిల్లాకు చెందిన శరత్ రెడ్డి మీడియా సంస్థల అధినేతగా పని చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మరపురాని చిత్రాలు నిర్మించిన నాగిరెడ్డి ఇంట ఇలాంటి మరణం చోటు చేసుకోవడంతో సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డి ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకు అయిన విశ్వనాథరెడ్డి చిన్న కొడుకు శరత్ రెడ్డి. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన శరత్ రెడ్డికి ఒక కొడుకు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

శరత్ రెడ్డి మృతిపై తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు మనో ధైర్యంను ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
Please Read Disclaimer