ఆన్లైన్ లో సాహో, ఇస్మార్ట్ శంకర్ తేదీలు ఖరారు

0

గతంలో సినిమా విడుదలైన తర్వాత టీవీలకు రావాలంటే కనీసం నాలుగు నెలలు సమయం ఉండేది, కానీ నేడు డిజిటల్ మాధ్యమాలు రావటంతో సినిమా విడుదలైన రెండు నెలలలోపు మన ముందుకి వస్తుంది. అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్, జీ 5 లాంటి సంస్థలు పోటీపడటంతో సినిమా బుల్లితెరమీద త్వరగానే దర్శనం ఇస్తుంది. ఇదే సమయంలో అటు నిర్మాతలకి కూడా మంచిగానే ఆదాయం వస్తుంది.

ఇక రీసెంట్ గా వెండితెర మీద హడావిడి చేసిన రెండు సినిమాలు మరి కొద్దీ రోజుల్లో డిజిటల్ మాధ్యమాల్లో రానున్నాయి. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాని జీ5 సంస్థ తీసుకుంది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 8న జీ5 డిజిటల్ లో విడుదల చేయనున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అన్ని డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ మొత్తం జీ సంస్థ దక్కించుకుంది .

ఇక పాన్ ఇండియా మూవీ అయినా సాహో కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమాని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. వాటి రూల్స్ ప్రకారం సినిమా విడుదలైన 50 లేదా 60 రోజుల తర్వాత ఆన్ లైన్ లో రిలీజ్ చేసుకోవచ్చు, ఆ లెక్కన చూస్తే ఈ నెల 18కి సాహో యాభై రోజులు పూర్తిచేసుకుంటుంది, 60 రోజులు అయితే 28 కి పూర్తీ అవుతుంది, కాబట్టి దీపావళి సందర్భంగా సాహో కూడా డిజిటల్ మాధ్యమంలో సందడి చేసే అవకాశం ఉంది.
Please Read Disclaimer