ప్లాప్ డైరెక్టర్ కి చరణ్ ఛాన్స్ ఇస్తాడా ?

0

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు చరణ్. అయితే ఈ లోపు చరణ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటికొచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా సుజీత్ ఉంటుందనేది ఆ వార్త. సాహోతో ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన సుజీత్ లేటెస్ట్ గా నెక్స్ట్ సినిమాకు ఓ కథను రెడీ చేసుకున్నాడట.

ఆ కథను చరణ్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. సుజీత్ నెక్స్ట్ సినిమా కూడా యూ.వి.క్రియేషన్స్ లోనే ఉండబోతుంది. ఇక యూ.వి. నిర్మాతలు చరణ్ ఓ అప్పట్లో ఓ అడ్వాన్స్ ఇచ్చారు. సో వీరిద్దరినీ జత చేసే పనిలో మేకర్స్ ఉన్నారని టాక్. అందుకే ఉన్నపళంగా ఈ వార్త చక్కర్లు కొడుతుంది. నిజానికి సాహో తర్వాత సుజీత్ నెక్స్ట్ ఒక చిన్న సినిమా చేస్తాడనే టాక్ నడిచింది.

కానీ సుజీత్ ఇప్పుడు చరణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. అన్నీ కుదిరితే వచ్చే నెల చరణ్ కి సుజీత్ నరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో మొదటి సిట్టింగ్ అయ్యాకె ఈ కాంబో సినిమాపై క్లారిటీ వస్తుంది. మరి చరణ్ కి స్క్రిప్ట్ నచ్చితే మాత్రం సుజీత్ కి అవకాశం ఇవ్వడం ఖాయం.
Please Read Disclaimer