తేజు పండగ గ్లింప్స్!

0

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ప్రతిరోజు పండగే’ చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్లు తెరకెక్కించడంలో స్పెషలిస్టు అయిన మారుతి ఈ సినిమాకు దర్శకుడు. రేపు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులకు ఈ సినిమా టీమ్ నుండి ఒక బర్త్ డే ట్రీట్ రెడీ అవుతోంది. రేపు ‘గ్లింప్స్ అఫ్ ప్రతిరోజూ పండగే’ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం.

ఈ పోస్టర్లో తేజు.. సత్యరాజ్ లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. తేజు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై కూర్చొని ఉండగా సత్యరాజ్ వెనక ఉన్నారు. తేజు స్లిమ్ గా ఫిట్ గా మోడరన్ గా కనిపిస్తూ ఉంటే సత్యరాజ్ మాత్రం అచ్చమైన తెలుగు పంచెకట్టులో ఉన్నారు. నేపథ్యంలో పచ్చటి చేలు ఉండడంతో పోస్టర్ ఎంతో ఆహ్లాదంగా ఉంది. తేజు-సత్యరాజ్ కాంబినేషన్ కొత్తగా ఉండడమే కాదు.. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.

ఈ సినిమాలో తేజు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్.. జీఎ2 పిక్చర్స్ వారు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమధ్యే ‘చిత్రలహరి’ సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చిన తేజుకు ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందేమో వేచి చూడాలి. రేపు శాంపిల్ గా రానున్న గ్లింప్స్ చూస్తే ప్రేక్షకులు ఈ పండగపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer