రవితేజ హోల్డ్ లో పెట్టిన స్క్రిప్ట్ తో మెగా హీరో సినిమా…?

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ‘ప్రస్థానం’ దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా స్టార్ట్ చేసాడు. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో తేజ్ మరో ప్రాజెక్ట్ ఓకే చేసాడని ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. కొత్త దర్శకుడు గోపాల కృష్ణ చెప్పిన స్టోరీ లైన్ కి సాయి ధరమ్ తేజ్ ఇంప్రెస్ అయ్యాడని.. వెంటనే ఓకే చేసాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మించనున్నాడని సమాచారం. రివేంజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి ఇప్పటికే ‘భగవద్గీత సాక్షిగా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.

కాగా మొదటగా ఈ స్టోరీని మాస్ మహారాజా రవితేజ కి వినిపించారట. రవితేజకి ఈ స్టోరీ నచ్చినప్పటికీ ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఓకే చేసి ఉండటంతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారట. దీంతో ఈ స్టోరీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకి వెళ్లిందట. మెగా హీరోల సినిమా స్టోరీల విషయంలో జాగ్రత్తలు తీసుకునే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ స్టోరీ విని.. గోపాల కృష్ణ చెప్పిన స్టోరీలో పలు మార్పులు సూచించాడట. ముఖ్యంగా సినిమాకి ట్రాజెడీ ఎండింగ్ వద్దని.. దాన్ని మార్చి హ్యాపీ ఎండింగ్ ఇవ్వమని సూచించాడట. ఇప్పటికే డైరెక్టర్ గోపాలకృష్ణ స్టోరీలో మార్పులు చేసి మెగాస్టార్ ని మెప్పించాడట. ప్రస్తుతం తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మరియు దేవ కట్టా సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తం మీద మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి న్యూ డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.