న్యూయార్క్ నగరం లో మెగా మేనల్లుడు

0

మెగా ఫ్యామిలీ లో ఫుల్ ఎనర్జీ ఉండే హీరోగా మెగా మేనల్లుడు సాయి తేజ్ ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం లో మంచి హిట్ల తో సత్తా చాటాడు కానీ తర్వాత మాత్రం వరస ఫెయిల్యూర్ల తో రేసు లో వెనకబడ్డాడు. ఈ మధ్యే ‘చిత్రలహరి’ సినిమా తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. తేజు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే హీరో. తరచుగా ఏదో ఒక అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.

కాసేపటి క్రితం తేజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “క్యాప్షన్ లేదు.. ఫిల్టర్ లేదు #న్యూయార్క్ నగరం #ఫ్రీడమ్ టవర్ #గ్రౌండ్ జీరో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. గ్రౌండ్ జీరో తెలుసు కదా? గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న స్థలమే. సెప్టెంబర్ 11 దాడి తర్వాత ఆ భవనాలు ఉన్న స్థలాన్ని గ్రౌండ్ జీరోగా పిలిస్తున్నారు. అక్కడే మన తేజు యమా స్టైలుగా నిలుచుని ఫోటోకు పోజిచ్చాడు. వైట్ షర్టు.. గ్రే కలర్ సూట్ ధరించి చెట్టుకు ఆనుకుని అమెరికా అబ్బాయి తరహా లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు.. చేతిలో ఫోను స్టైల్ ను మరింతగా పెంచాయి. నేపథ్యం లో ఉండే చెట్లు కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఏదైతేనేం.. ఎప్పుడూ హీరోయిన్లేనా ఇలా అందమైన.. స్టైలిష్ ఫోటోలు తీయించుకునేది.. మగజాతి ఎక్కడా తగ్గదు.. మెగా స్టైల్ లో ఉంటుంది అన్నట్టు గా రాఫ్ఫాడించాడు తేజు.

సినిమాల విషయానికి వస్తే డిసెంబర్ లో తేజు కొత్త సినిమా ‘ప్రతిరోజూ పండగే’ విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కాకుండా తేజు ‘సోలో బతుకే సో బెటర్’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తో సుబ్బు అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
Please Read Disclaimer