టచింగ్ మెసేజ్ ఇచ్చిన మెగా హీరో

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాలో తేజు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్యే రాశి ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఒక పాట కూడా విడుదల చేశారు. రాశికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటో పోస్ట్ చేసి ‘చెయ్యి తియ్యి’ అంటూ సరదాగా ట్వీట్ చేయడం.. మారుతి ఆ ఫోటోకు కౌంటర్ ఇవ్వడం తెలిసిన విషయాలే.

తాజాగా ఈ ట్వీట్ కు కొనసాగింపు అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. తను పోస్ట్ చేసిన ‘చెయ్యి తియ్యి’ ట్వీట్ కు వచ్చిన మీమ్స్ ఫోటో ను షేర్ చేస్తూ “ఈ స్పందనలు చూస్తే నాకు ఈ ఆలోచన వచ్చింది: మీ ఫేవరెట్ హీరోయిన్ పై చెయ్యి వేస్తేనే ‘#చెయ్యితీ’..#హాత్ నికాలో’ అన్నారు. ఇది సినిమాలో భాగం అని తెలిసినా కూడా స్పందించారు. అయితే మన చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో కూడా ఇంతే బాధ్యతగా ఉంటే #ప్రియాంకరెడ్డి సంఘటన లాంటి అత్యాచారాలు జరగవు” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి చక్కని స్పందన దక్కింది. “నిజమే..మన చుట్టూ ఉన్న అమ్మాయిలను మన ఇంట్లో అక్క.. చెల్లి.. అమ్మ లాగానో చూస్తేనే ఇలాంటి దారుణాలు జరగవు. తప్పకుండా అలాంటి రోజు వస్తుందని కోరుకుంటాను” అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు తేజు ఆలోచనను మెచ్చుకున్నారు.
Please Read Disclaimer