దేవకట్టాతో తేజ్ ఫిక్స్ !

0

మారుతి డైరెక్షన్ లో ‘ప్రతి రోజు పంగడే’ సినిమా చేస్తున్నాడు సాయి తేజ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో మూడు నెలల్లో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరు దర్శకులతో రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు మెగా హీరో. అందులో ఒకరు సుబ్బు. నెక్స్ట్ సినిమాతో సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేయనున్న తేజ్ దేవకట్టా కూడా సినిమా చేయబోతున్నాడు.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం దేవకట్టా సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయిందట. తెలుస్తుంది. భగవాన్ – పుల్లారావు ఈ కాంబో సినిమాను నిర్మించనున్నారు. ఓ మంచి రోజు చూసుకొని అఫీషియల్ గా సినిమాను అనౌన్స్ చేయనున్నారట. ప్రవీణ్ సత్తారు తో కలిసి ఇటీవలే బాహుబలి వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసాడు దేవకట్టా. ఆ షూటింగ్ పూర్తయిందని సమాచారం.

వచ్చే నెలలో సుబ్బుతో చేయబోయే సినిమాను ప్రారంభిస్తాడట తేజ్. ఆ తర్వాత దేవ కట్టా సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడని అంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే తేజ్ మిగతా సినిమాల గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది. చిత్రలహరితో మళ్లీ ట్రాక్ ఎక్కిన తేజ్ ఇలా వరుసగా డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.
Please Read Disclaimer