ఆయనతో రిస్కేమో తేజు!

0

ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి రూపంలో కొద్దిగా రిలాక్స్ ఫీలైన సాయి ధరం తేజ్ కొత్త సినిమా ప్రతి రోజు పండగే షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఇంకో రెండు నెలల లోపే షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో సాగుతున్నట్టు సమాచారం. దీని తర్వాత దేవ కట్టా వీరు పొట్లలతో చర్చల్లో ఉన్న తేజ్ తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.

అనిల్ సుంకర నిర్మాణంలో డైరెక్టర్ తెలుగు మూవీ చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారట. దీనికి టైం పట్టేలా ఉన్నా కథ పరంగా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. కాని ఇక్కడే ఒక రిస్క్ ఉంది. వెంకట్ ప్రభు గొప్ప టాలెంట్ ఉన్న దర్శకుడే కాని మన నేటివిటీ సింక్ అయ్యేలా ఆయన సినిమాలు ఇక్కడ అంతగా మెప్పించలేకపోయాయి.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గ్యాంబ్లర్ ఇక్కడ జస్ట్ యావరేజ్ అయ్యింది. సూర్యతో తీసిన రాక్షసుడు ఫ్లాప్ అయ్యింది. కార్తి బిర్యానీ కూడా డిజాస్టరే. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రెండేళ్ళుగా నిర్మాణంలో పార్టీతో పాటు మానాడు కూడా ఆగుతూ సాగుతూ షూటింగ్ లో ఉంది. ఇవి అయ్యాకే సాయి ధరం తేజ్ తో పట్టాలెక్కొచ్చు. ఇక్కడ చెప్పిన అంశాలను బట్టి చూస్తే వెంకట్ ప్రభుతో స్టొరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home