పెళ్లి పై స్పందించిన మెగా హీరో..

0

మెగాఫ్యామిలీ నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీలో హిట్టా.. ఫట్టా.. అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో ఎవరంటే కేవలం సాయిధరమ్ తేజ్ మాత్రమే. ఈ కుర్ర హీరో ఇటీవలే మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజు పండగే’ సినిమాతో హిట్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ కావడంతో ఇక నుండి ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుబ్బు అనే కొత్త దర్శకుడితో ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ – కరోనా అంటూ హడావిడి లేకపోతే ఈ నెలలోనే ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా విడుదల అయ్యుండేది.

ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా సాయిధరమ్ తేజ్ ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు ఈ మెగా అల్లుడు. నెట్టింట్ లో మీ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు.. ఆయన బదులిస్తూ.. మా అమ్మ ఇప్పటికే పెళ్లి చేసుకోమని రోజూ తెగ గొడవ చేస్తుంది. ఇప్పటికే ఒంటిమీదకి 33ఏళ్ళు వచ్చేశాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్? త్వరగా చేసుకోమని అమ్మ అంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే మరి మీ ఫ్యామిలీ హీరోలంతా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు కదా.. మరి మీ సంగతేమిటీ? అని అడగగా.. అదృష్టం కలిసి వచ్చి తాను కూడా ఈ యేడాది లవ్లో పడొచ్చేమో అంటూ ప్రేమపై తన స్పందన తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఈ మెగా మేనల్లుడు శుభవార్త చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అన్పిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home