సాయి ధరమ్ తేజ్ కూడా చూపించబోతున్నాడా?

0

ఈమద్య కాలంలో హీరోలు కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్ బాడీని సినిమాల్లో ప్రదర్శించడం చాలా కామన్ అయ్యింది. టాలీవుడ్ లోని దాదాపు యంగ్ హీరోలు అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఒకరు ఇద్దరు హీరోలు బ్యాలన్స్ ఉంటే వారు కూడా సిక్స్ ప్యాక్ ను ట్రై చేస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు తన బాడీని ఎక్స్ పోజ్ చేసింది లేదు. మొదటి సారి తన బాడీని షో చేసేందుకు ప్రతి రోజు పండుగే సినిమాను ఎంచుకున్నాడు.

మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజు పండుగే’ సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు అని చెప్పేందుకు ఈ స్టిల్ ను విడుదల చేసినట్లుగా అనిపిస్తుంది.

బ్యాక్ నుండి తేజ్ కండలు చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకర్షిస్తుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశిఖన్నా కనిపించబోతుంది. ఈ సినిమాతో తేజ్ మరో సక్సెస్ కొట్టడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
Please Read Disclaimer