సంక్రాంతి బరిలో నిలవనున్న మెగా మేనల్లుడు…?

0

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోడానికి ట్రై చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను చూసిన తేజ్.. ఆ తర్వాత అర డజన్ ఫ్లాపులను చవి చూసాడు. ఈ నేపథ్యంలో ‘చిత్రలహరి’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘ప్రతీరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో తేజ్ ఇప్పుడు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇటీవల రిలీజైన ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అయితే ఈ సినిమా సంక్రాతి బరిలో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేసేలా కనిపించడం లేదు. దీంతో ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే సిచ్యుయేషన్ లేదు. అందులోనూ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయట. సో ఎప్పటికైనా దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందే. కానీ దిల్ రాజు ‘వకీల్ సాబ్’ కంప్లీటై రిలీజ్ అయ్యే వరకు వేరే సినిమాలు విడుదల చేయకూడదు అనే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ లో కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది ఒక బ్యాచిలర్ స్టోరీ అని.. పెళ్లి అంటే ఇష్టం లేక సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే కుర్రాడి కథ అని తెలుస్తోంది. మరి ఈ స్టోరీతో సాయి ధరమ్ తేజ్ తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer