సైరా : పార్టీ అడిగిన మెగా మేనల్లుడు

0

చిరంజీవి 151వ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రామ్ చరణ్ నిర్మించాడు. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా నయనతార మరియు తమన్నాలు హీరోయిన్స్ గా నటించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంకు మెగా ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ ను ఏ విధంగా అయితే చూడాలనుకున్నామో అలాగే ఈ చిత్రంలో నటించాడు.. దర్శకుడు చూపించాడు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సైరా టాక్ నేపథ్యంలో మెగా బ్రదర్స్ మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. సైరా నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అంటూ కొణిదెల ప్రొడక్షన్స్ ను పార్టీ ఎప్పుడూ ఎక్కడ అంటూ ట్యాగ్ చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రంకు మంచి టాక్ దక్కినట్లుగా సోషల్ మీడియాలో సైరా గురించి పోస్ట్ అవుతున్న కామెంట్స్ ను చూస్తే అర్థం అవుతుంది.

దాదాపుగా రెండు సంవత్సరాల పాటు సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకు వెళ్లడంతో విడుదల వాయిదా పడేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సైరా నరసింహారెడ్డి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి రికార్డులను కూడా కొట్టే విధంగా సైరా ఉందంటూ మెగా వీరాభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు బెన్ ఫిట్ షోలు చూసి వచ్చిన వారు చెబుతున్నారు. లాంగ్ రన్ లో సైరా ఏమేరకు వసూళ్లను దక్కించుకుంటుందో చూడాలి.