సంక్రాంతికి కొత్తగా ఫిదా చేస్తారా లేదా?

0

శేఖర్ కమ్ముల.. సాయి పల్లవిల కాంబోలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం టైటిల్ కు తగ్గట్లుగానే ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేకర్ కమ్ముల ఎట్టకేలకు నాగచైతన్య హీరోగా మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా ఒక క్యూట్ లవ్ స్టోరీ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. కాని షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా కాకపోవడం వల్ల సినిమా సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ చిత్రం నుండి సంక్రాంతి కానుక రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు టైటిల్ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న ఫస్ట్ లుక్ లో టైటిల్ ను రివీల్ చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఫిదాకు ఏమాత్రం తీసిపోకుండా పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. నాగచైతన్య మరియు సాయి పల్లవిల కాంబో ఖచ్చితంగా ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం అనిపిస్తుంది. ఇక దర్శకుడు తనదైన శైలిలో సినిమా స్క్రీన్ ప్లేను నడిపిస్తే సినిమా అదిరి పోవడం ఖాయం అంటూ అక్కినేని అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటు నాగచైతన్య కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతారు. చాలా విభిన్నమైన నేపథ్యంలో ఒక సింపుల్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నాడట. సంక్రాంతికి రాబోతున్న ఫస్ట్ లుక్ తో సినిమా అసలు విషయం ఏంటో తెలిసి పోయే అవకాశం ఉంది.
Please Read Disclaimer