లీకుల పల్లవి అని పిలవాలేమో!

0

లీక్డ్ వీడియోల పబ్లిసిటీ అంత కంతకు పీక్స్ కి చేరుకుంటోంది. ఏదైనా పబ్లిక్ లో షూటింగ్ చేస్తే ఫ్యాన్స్ అత్యుత్సాహంగా మొబైల్ లో చిత్రీకరించి ఆ వీడియోల్ని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం అవి కాస్తా వైరల్ అయిపోవడం చూస్తున్నదే. ఇంతకుముందు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కరీంనగర్ లోని ఓ రైల్వే స్టేషన్ లో కూచుని ఉన్నా తనని ఎవరూ పట్టించుకోని దృశ్యం ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరిచింది. అంత సహజంగా ఒదిగిపోయి ఆ సీన్ లో నటించేసిందని ఆ తర్వాత తెలుసుకున్న వారికి మరింత సర్ ప్రైజ్ తప్పలేదు.

ఈ తరహా ప్రయోగాలు ఇంతకు ముందు తమిళ తంబీలు చేసేవారు. పబ్లిక్ లో హిడెన్ కెమెరాలు పెట్టి షూటింగులు చేసేయడం.. నాయకానాయికలు సహజంగా ఒదిగి పోయి మార్కెట్ సీన్ల లో నటించేప్పుడు అది షూటింగా కాదా? అన్నది లీకవ్వకుండా జాగ్రత్త పడడం వగైరా వగైరా ప్రయోగాలు తమిళంలో చేశారు.

అదే తీరు గా ప్రస్తుతం శేఖర్ కమ్ముల సైతం ప్రయోగాలు చేస్తున్నారట. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా ఆయన తెరకెక్కిస్తున్న ప్యామిలీ సెంటిమెంటు ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని కాస్త నేచురల్ పంథాలోనే తెరకెక్కిస్తున్నారట. తాజాగా సాయిపల్లవిపై ఓ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇది హైదరాబాద్ పద్మారావ్ నగర్ లో సాగుతోంది. అక్కడ రోడ్ కి అటూ ఇటూ ఇళ్ల సెటప్ ఉంటుంది. ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెళ్లే సీన్ అది. జనాలు రోడ్ పై వెళుతున్నా.. ఎంతో సహజంగా సాయి పల్లవి ఆ ఇంటి గేట్ తెరిచి లోనికెళ్లే సీన్ ని తెరకెక్కించారు. అయితే ఎలా లీకైందో ఆ సీన్ లీకైంది. ఎవరో మొబైల్ లో వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టేశారు. దీంతో మరోసారి ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సీన్ కోసం హిడెన్ కెమెరాల్ని ఉపయోగించారట. `విరాట ఫర్వం` సీన్ లీక్ తర్వాత ఈసారి కమ్ములకు లీకుల బెడద తప్పడం లేదు. సాయిపల్లవిని చూడగానే లీకు వీరులు రెచ్చిపోతున్నారు మరి. అందుకే తనని లీకుల పల్లవి అనాలేమో!
Please Read Disclaimer