ఏడేళ్ల బాలిక రేప్ ఘటన పై స్పందించిన సాయిపల్లవి.. ఏమందంటే..?

0

ఓ వైపు దేశం కరోనా ప్రభావంతో ఏమైపోతుందో తెలియదు కానీ రోజురోజుకి హత్యలు.. రేప్ కేసులతో మాత్రం నాశనం అయిపోతుందని చెప్పవచ్చు. అలాంటి దుర్ఘటనలు.. దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి జయరాజ్ -ఫినిక్స్ ల మర్డర్.. కొత్తగూడెంలో దేవిక రేప్ లను మరవకముందే ఆసిఫా లాంటి ఘోరమైన ఘటన తమిళనాడులో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల చిన్నారి పై దారుణానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. వారిని కఠినంగా శిక్షించాలని సమాజం ఎలుగెత్తి చాటుతోంది. ఈ దారుణం పై హీరోయిన్ సాయి పల్లవి తన ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని పుదుకొట్టాయ్ జిల్లాలో ఏడేళ్ల బాలికను ముగ్గురు దుండగులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆపై ఆ బాలికను చంపేశారు. ఈ ఘటన పై తమిళ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియాలో #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్తో న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ దారుణ ఘటనపై నటి సాయిపల్లవి స్పందించి.. “మానవ జాతిపై ఉన్న ఆశలు వేగంగా చచ్చిపోతున్నాయి. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినయోగం చేస్తాము. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిపై మన అధికారాన్ని చూపిస్తాము. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతాము. ప్రతి రోజు గడిచేకొద్దీ ప్రకృతి మనకొక సందేశాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మన జాతి పూర్తిగా తుడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి దారుణ ఘటనలు చూడానికి అలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాము. మనం దేనికీ పనిరాకుండా ఉండిపోయాం.

ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఇలా గుర్తించబడని.. రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్నందున కచ్చితంగా గుర్తు పట్టేందుకు హ్యాష్ ట్యాగ్లు పెట్టాల్సి వస్తోందని సెటైర్స్ వేసింది. చివరగా ఈ ఆవేదనం అంతా ఏడేళ్ల బాలికకు జరిగిన అన్యాయానికి #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్ను జోడించి తన సంతాపాన్ని ప్రకటించింది. ప్రస్తుతం నెటిజన్లు సాయిపల్లవికి మద్దతు పలుకుతున్నారు.