నేను తమిళమ్మాయిని.. ఇంకోసారి అలా పిలవకండి: సాయిపల్లవి

0

సాయిపల్లవి. ఈ బ్యూటీ పేరు సౌత్ సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఫిదా’ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి అందరి మనసులు దోచుకుంది. అంతేగాక ఈ నేచురల్ బ్యూటీ విభిన్నమైన సినిమాల ఎంపిక చేసుకుంటూ మంచి నటిగా పేరొందుతుంది. పాత్రకు తగ్గట్లుగా హావ భావాలను ఎంతో చక్కగా ప్రదర్శిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఈ చెన్నై భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. హీరో రానా సరసన నటిస్తున్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి ఒక పేద జానపద కళాకారిణిగా కనిపించనుందట.

అంతేగాక రెండోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీలో నాగచైనత్య హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ.. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఫిదా పడిపడి లేచే మనసు సినిమాలలో సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదట. మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందని.. మేకప్ లేకుంటేనే బాగుంటానని అంటుంది. అయితే మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతోనే అమ్మడికి మంచి బ్రేక్ లభించింది. ఇక ఇంటర్వ్యూలో సాయి పల్లవిని యాంకర్ మలయాళీ అని పిలిచిందట. అలా పిలవడంతో ఈ చెన్నై బ్యూటీకి కోపం వచ్చి ‘నేను మలయాళీని కాదు. తమిళమ్మాయిని. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి’ అంటూ కాస్త సరదాగా సమాధానం ఇచ్చిందట ఈ నేచురల్ బ్యూటీ.
Please Read Disclaimer