బ్రాండ్ కే బెండు తీసి ఫిదా చేసింది!

0

ఈటీవీ ఫేమస్ డ్యాన్స్ షో ఢీ లేడీస్ స్పెషల్ 2010లో ఎంతో పాపులరైన సంగతి తెలిసిందే. ఈ షో ద్వారానే సాయి పల్లవి వెలుగులోకి వచ్చింది. జార్జియాలో మెడిసిన్ చేసిన ఈ తమిళ కుట్టి మలయాళ చిత్రం `ప్రేమమ్`ద్వారా పాపులర్ అయింది. అయితే కెరీర్ తొలి నాళ్ల నుంచి నటనకు ప్రాముఖ్యత వున్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్న సాయి పల్లవి అంటే హీరోలు ఒకింత భయపడుతున్నారు. ఎక్కడ తమని డామినేట్ చేస్తుందోనని తనతో కలిసి నటించడానికి జంకుతుండడం ఇటీవల ఫిలింసర్కిల్స్ లో చర్చకొచ్చింది.

నటనాభినయం పరంగా ఇప్పటికే తనదైన మార్కుని చూపించిన సాయి పల్లవికి ఫాలోయింగ్ అసాధారణంగా ఉంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ఓ సంస్థ తన ఉత్పత్తుల కోసం సాయి పల్లవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని..కమర్షియల్ ప్రకటన నిమిత్తం భారీ మొత్తం చెల్లించడానికి ముందుకొచ్చింది. అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించి సాయి పల్లవి షాకిచ్చింది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం` చిత్రంతో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది.

ఇదిలా వుంటే తాజాగా మరో బిగ్ డీల్ ని ఫిదా బ్యూటీ కాదనుకుందట. వేరొక పెద్ద కార్పొరెట్ సంస్థ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు సాయి పల్లవికి కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. అయితే ఎప్పటిలాగే ఈ ఆఫర్ ని కూడా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. రెమ్యునరేషన్ టెంప్ట్ చేయకపోవడం వల్లే సాయి పల్లవి ఆ బ్రాండ్ని తిరస్కరించిందా..? లేక తన ఎథిక్స్ ని కాదనుకోలేక ఒప్పందం కుదుర్చుకోలేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer