పుట్టపర్తి లో భక్తురాలుగా సాయి పల్లవి

0

గ్లామర్ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ చాలామంది సెలబ్రిటీల కు భక్తి భావం ఎక్కువ. కొందరు అయ్యప్ప మాలధారణ చేస్తే మరి కొందరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని తరచుగా దర్శించుకుంటూ ఉంటారు. హీరోయిన్ సాయి పల్లవికి కూడా భక్తిభావం ఎక్కువే. సాయిపల్లవి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అందుకే ఈమధ్య పుట్టపర్తికి పయనమైంది.

నవంబర్ 23 పుట్టపర్తి సాయిబాబా జయంతి. ఈ ఏడాది 94 వ జయంతి వేడుకలు పుట్టపర్తి లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాయిపల్లవి తన తల్లిగారు రాధ కన్నన్ తో కలిసి పుట్టపర్తి ఆలయాన్ని సందర్శించుకుంది. ఈ సమయంలో సాయిపల్లవి పూర్తి సంప్రదాయ తరహాలో కంచి పట్టుచీర ధరించి ఒక సాధారణ భక్తురాలి లాగా కనిపించింది. మిగతా హీరోయిన్లలా కాకుండా సాయి పల్లవి కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని తెలిసిందే. ఈ ట్రెడిషనల్ లుక్ లో హోమ్లీ గా కనిపిస్తున్న సాయిపల్లవి ని చూసి వారందరూ సాయిపల్లవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాట పర్వం’ సినిమాలోనూ.. శేఖర్ కమ్ముల – నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer