నానిని ఇంకా వెయింటింగ్ లోనే పెట్టింది

0

నాని హీరోగా రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చి నెలలు గడుస్తోంది. కాని మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ మొదలు కాలేదు. ఈ గ్యాప్ లో దర్శకుడు స్క్రిప్ట్ కు మరింతగా మెరుగులు దిద్దడంతో పాటు నటీనటులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. సినిమా అనుకున్న సమయంలోనే హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట. ఆ సమయంలో తన నిర్ణయంను వెళ్లడి చేయని సాయి పల్లవి ఇంకా కూడా నిర్ణయంను చెప్పలేదట.

ఇటీవల సాయి పల్లవికి దర్శకుడు రాహుల్ స్క్రిప్ట్ నరేషన్ చేశాడట. స్క్రిప్ట్ మొత్తం సావదానంగా విన్న సాయి పల్లవి ఇప్పటికి కూడా తన నిర్ణయంను చెప్పకుండా సస్పెన్స్ లోనే ఉంచిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త సినిమాలు కమిట్ అవ్వడం ఎందుకు అనుకుంటుందా లేదంటే నానితో సినిమా విషయంలో ఆలోచిస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి వల్ల శ్యామ్ సింగరాయ్ విషయంలో దర్శకుడు ముందుకు వెనక్కు వెళ్లలేక పోతున్నాడట.

సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం చిత్రంతో పాటు నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. మరో వైపు తమిళంలో కూడా సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు కమిట్ అయ్యి ఉన్న కారణంగానో లేక మరేంటో కాని సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ సినిమాకు మాత్రం ఇంకా సైన్ చేయలేదు. అలా అని నో కూడా చెప్పలేదట. త్వరలో నిర్ణయాన్ని సాయి పల్లవి వెళ్లడిస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు వెయిట్ చేస్తున్నారట.
Please Read Disclaimer