సాటి హీరోయిన్లను ఉతికారేసిన రౌడీ పిల్ల

0

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సహజనటన గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అతి తక్కువ మ్యాకప్ తో కనిపిస్తుంది. నేచురాలిటీని మించిన సౌందర్యం ఎక్కడ దొరుకుతుంది అన్నది తన ఫార్ములా. సాటి గ్లామరస్ హీరోయిన్లు అంతా ఒక ఎత్తు అనుకుంటే…సాయి పల్లవి మరో ఎత్తు. ప్రోఫెషనల్ గా.. చాలా ప్రత్యేకతలు కలిగిన నటి. కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు మాత్రమే ప్రాముఖతనిస్తూ సినిమాలు చేస్తోంది.

కోట్లలో పారితోషికాలు ఎరవేసినా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరించేందుకు ఆసక్తి చూపలేదు. తనకు నచ్చనిది నచ్చలేదని చెప్పే వ్యక్తిత్వం తన సొంతం. ఒక యాడ్ చేస్తే మనకి వచ్చేదెంత? దాని వల్ల ప్రజల్లోకి ఏదైనా చెడు సందేశం వెళ్తుందా? అని లోతుగా ఆలోచించే పరిణతి ఉన్న నటి. అలా ఇటీవలే ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ నుంచి భారీ ప్యాకేజ్ తో ఆఫర్ ను వదులుకుంది. తాజాగా ఓ ఇంటర్వూలో తన ఫాలోయింగ్ ను గుర్తు చుసుకుంటూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు వెళ్లే హీరోయిన్లందరికీ పెద్ద క్లాస్ కూడా పీకింది.

హీరోయిన్లు అంటే సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ షాపింగ్ మాల్స్ కి వెళ్లడం మాత్రమే కాదు. ఓ అమ్మాయిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఆత్మాభిమానంతో వ్యవరించాలి. అవకాశాల కోసం ఆశ పడకూడదని పరోక్షంగా చీవాట్లు వేసింది. ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాటపర్వం.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ సరసన నటిస్తోంది. పలు తమిళ్ సినిమాలు కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer