ఆయన తీరుతో ఇంటికెళ్లి ఏడ్చేసిందట

0

సాయి పల్లవి అందంతో పాటు ప్రతిభ ఉన్న నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఈ అమ్మడు తెలుగు.. తమిళం.. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. తాజాగా ఈమె తమిళంలో సూర్యతో కలిసి ‘ఎన్జీకే’ చిత్రంలో నటించింది. ఆ చిత్రంను మే 31న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈచిత్రంకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు సెల్వ రాఘవన్ సీన్స్ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన ఏ సీన్ ను అంత త్వరగా ఒప్పుకోడు అంటూ మొదటి నుండి టాక్ ఉంది.

‘ఎన్జీకే’ చిత్రం షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం సాయి పల్లవిని దర్శకుడు సెల్వ చాలా ఇబ్బంది పెట్టాడట. పదే పదే రీ షూట్ అనడంతో సాయి పల్లవి కన్నీరు పెట్టుకుందట. ఆ రోజుకు ఆ షాట్ సరిగా రాకపోవడంతో తర్వాత రోజు చేద్దామని ఆ రోజుకు దర్శకుడు పేకప్ చెప్పాడట. షూటింగ్ కు పేకప్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి అమ్మకు విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నట్లుగా తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాను అనుకున్నది వచ్చే వరకు ఆయన వదిలి పెట్టడని తర్వాత రోజు వెంటనే ఆ షాట్ ను తాను పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని సూర్య వద్ద ప్రస్థావించగా ఆయన నా షాట్స్ ను కూడా మళ్లీ మళ్లీ రీ షూట్ చేస్తాడు.. ఎప్పుడు కూడా ఒక్క టేక్ కు సెల్వ రాఘవన్ ఓకే చెప్పడని సూర్య చెప్పడంతో తాను కాస్త శాంత పడ్డానంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఎన్జీకే చిత్రంలో సూర్యకు భార్య పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది.