సుప్రీం హీరో ఎమోషన్ కి కారణమేంటో తెలిస్తే!

0

థియేటర్లు తెరిచి ఎనిమిది నెలలవుతోంది. ఇంత సుధీర్ఘ కాలం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో రిలీజ్కు సిద్ధమైన సినిమాలన్నీ ల్యాబులకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. థియేటర్లు తెరవకపోవడంతో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. కొన్ని సెట్స్ పై వుంటే.. అన్ లాక్ ప్రక్రియలో కొన్ని సినిమాలు ఇప్పటికే అన్నిపనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్నా.. పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. థియేటర్లకు జనాదరణ కరువైంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.

ఈ క్రైసిస్ నేపథ్యంలో `కమ్ లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్` అంటూ కన్నడ స్టార్స్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. శివరాజ్ కుమార్ తో పాటు క్రేజీ హీరోలు పాల్గొన్న ఈ వీడియో సినీ ఇండస్ట్రీ వర్గాలని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన పూరి జగన్నాథ్ “ఈ వీడియో చూసిన తరువాత కన్నీళ్లొచ్చాయి. మళ్ళీ ఆ రోజులు రావాలి . విజిల్స్ వెయ్యాలి .. పేపర్స్ ఎగరాలి … చొక్కాలు చిరగాలి .. సినిమా థియేటర్ మన అమ్మ“ అంటూ ఎమోషనల్ అయ్యారు.

యంగ్ హీరో సాయి తేజ్ కూడా పూరి ట్వీట్ ని రీట్వీట్ చేసి భావోద్వేగానికి లోనయ్యారు. థియేటర్ రీఓపెన్ కోసం ఆగలేకపోతున్నా` అన్నారు. సాయిధరమ్తేజ్ నటించిన చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్` రిలీజ్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కోసం తేజ్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లు ఎప్పుడు రీఓపెన్ అవుతాయా.. తన సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తానా అని ఎదురుచూస్తున్న సుప్రీమ్ హీరో ఆకాంక్ష నెరవేరేదెలా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. థియేటర్లు తెరిచి పరిస్థితి యథావిధిగా మారాలన్న సుప్రీం హీరో ఆకాంక్ష నెరవేరుతుందా లేదా? అన్నది వేచి చూడాలి.